అన్వేషించండి
Brahmamudi Serial November 18th Episode Highlights: టేబుల్ కింద దాక్కున్న దుగ్గిరాల వారసుడు కళావతి కంటపడితే - బ్రహ్మముడి నవంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 18th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

బ్రహ్మముడి సీరియల్ నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ సీన్స్ అంటే ... డిజైన్లు తస్కరించేందుకు కావ్య క్యాబిన్ కి వెళ్లిన రాజ్ దొరికిపోతాడా లేదా అనే..
2/7

CEO పోస్టుని ఎలాగైనా దక్కించుకునేందుకు రకరకాల వేషాలేస్తున్నాడు రాజ్..ముఖ్యంగా కావ్య ఆ ప్లేస్ లో కూర్చోవడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు అందుకే కావ్యను CEO గా దించేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు
3/7

కావ్య CEO గా ఉన్నప్పుడు రాజ్ కనీసం ఆ కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు..కానీ పందెంలో గెలిచి రాజ్ CEO అయితే మాత్రం కళావతి CEO గా దిగిపోవడమే కాదు ఆ కంపెనీ వైపు కన్నెత్తైనా చూడకూడదు..
4/7

సీతారామయ్య పెట్టిన ఈ పోటీలో రాజ్ గెలిస్తే కావ్య-రాజ్ శాశ్వతంగా విడిపోతారు..కావ్య గెలిస్తే రాజ్ మళ్లీ ఓ మెట్టు దిగాల్సిందే.. అందుకే కావ్యను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజ్
5/7

ఉద్యోగులను రెండు టీమ్స్ గా విడగొట్టిన రాజ్ పందెంలో తను గెలిచేలా చేయాలని చెబుతూ ఎన్నికల హామీల్లా తాయిలాలు ప్రకటించాడు.
6/7

కావ్య మాత్రం కష్టంతోనే గెలవాలని ఫిక్సైంది.. పైగా తను దుగ్గిరాల ఇంటి వారసుడు హామీలు ఇస్తే నెరవేర్చగలడు..ఎప్పటికైనా ఈ కంపెనీకి తనే CEO..అందుకే నేను నెరవేర్చలేని హామీలు ఇవ్వనంటుంది
7/7

కావ్య డిజైన్లు దొంగిలించేందుకు వెళ్లిన రాజ్...క్యాబిన్లోకి కావ్య రావడం చూసి టేబుల్ కింద దాక్కుంటాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతున్న కావ్య ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు అనుకుంటుంది.. మరి రాజ్ ను చూస్తుందా లేదా అన్నది నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది
Published at : 17 Nov 2024 09:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నల్గొండ
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion