అన్వేషించండి
Satyabhama Serial March 1st Episode Highlights:మహదేవయ్యని చూసేందుకు దొంగలా వచ్చి దొరికిన క్రిష్.. గెంటేసిన సంజయ్ - సత్యభామ మార్చి 1 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial March 1st Episode : నా కొడుకువి కాదు కుక్కవి అంటూ క్రిష్ ని బయటకు గెంటేశాడు మహదేవయ్య.. తండ్రి దగ్గరకు చేరాడు క్రిష్... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial March1st Episode Highlights
1/10

తాగేసి ఇంటికొచ్చిన క్రిష్ తో వాస్తవం ఇదే అర్థం చేసుకో అని మాట్లాడుతుంది సత్య. తనకు బాపు తర్వాతే అందరూ అన్నట్టు ప్రవర్తిస్తాడు క్రిష్. మనం సంతోషంగా ఉందాం అని బతిమలాడుతుంది. మా బాపుకి నేనంటే ఇష్టం అని పదే పదే అదే మాట అంటాడు
2/10

సత్యకి ఫోన్ ఇచ్చిన క్రిష్..బాపు కాల్ చేస్తే నాకు ఇవ్వు అంటాడు. అన్నం కూడా తినకుండా పడుకుంటాడు క్రిష్. తనని ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతుంది సత్య
3/10

హర్షకి కాల్ చేస్తుంది మైత్రి. స్పీకర్ ఆన్ చేయమంటుంది నందిని. ఆ రోజు రాత్రి జరిగినదానిగురించి మైత్రి మాట్లాడుతుందేమో అని భయపడతాడు హర్ష.
4/10

డాక్యుమెంట్లు తీసుకురా అని అంటుంది మైతే్రి. నందిని మొండిది నిన్ను నేను ఎత్తికెళ్లిపోతా అనుకుంటోంది అంటుంది. ఆ మాట విని హర్ట్ అవుతుంది నందిని
5/10

మహదేవయ్య ఇంటికి వెళుతుంది సత్య. ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా బయటే ఆగు అంటుంది భైరవి. వచ్చింది ఎవరో తెలుసా పాతికేళ్లు నీకు ఊడిగం చేసిన చిన్నా భార్య.. మీరు గెంటేసినా మళ్లీ వచ్చిందంటే ఎంత ఆత్మాభిమానం చంపుకుందో..ఎందుకు వచ్చిందో అడగండి అంటుంది జయమ్మ
6/10

అనాల్సినవి ఇంకా మిగిలిఉన్నాయేమో అంటాడు సంజయ్. నేను చిన్నా గురించి మాట్లాడేందుకు వచ్చాను అత్తయ్యా అంటుంది. ఎవరు అత్తయ్య అంటుంది భైరవి. చిన్నా ఎవరో మర్చిపోయారా..అంటూ మామయ్యకి కత్తిపోటు తగలబోతే అడ్డుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు చూడండి అతను చిన్నా అంటే.
7/10

గంగ వచ్చి చిన్నా మీ కొడుకు కాదు అంటే మీరు గుండెలు బాధుకున్నారు చూడండి తనే చిన్నా అంటే...మహదేవయ్య కూడా రివర్స్ లో మాట్లాడుతాడు. నేను వాదనకు రాలేదు అంటుంది
8/10

క్రిష్ ని ఇదివరకట్లా పిలవండి...బాపు అని పిలవనీయండి. చాలా డిస్ట్రబ్ అయ్యాడు. ఒక్క సారి క్రిష్‌ని దగ్గరకు చేర్చుకోండి అంటుంది. ఈ తెలివి ఇంతకాలం ఏమైందని రివర్సవుతాడు మహేదవయ్య.
9/10

దగ్గరుండిని కొంగున కట్టుకుని నాటకాలు ఆడించి ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చింది అంటుంది భైరవి. ఇక్కడి నుంచి పోమ్మా అంటుంది
10/10

సత్యభామ మార్చి 1 ఎపిసోడ్ లో అర్థరాత్రి మహదేవయ్య ఇంటికి వస్తాడు క్రిష్. సంజయ్ హడావుడి చేసి నిలదీయడంతో... బాపుని చూడాలి అనిపించి వచ్చాను అంటాడు.. చొక్కా పట్టుకుని సంజయ్ గెంటేస్తుంటే సత్య వస్తుంది...
Published at : 01 Mar 2025 09:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion