US Presidential Election 2024: యూఎస్ ఎన్నికల్లో టై అయితే ఏమవుతుంది? అమెరికా అధ్యక్షుడి జీతమెంత?
Donald Trump Vs Kamala Harris: అమెరికాలో జరగబోయే ఎన్నికలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. గెలిచిన తర్వాత అధ్యక్షుడు తీసుకునే జీతం ఎంత?
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర నుంచి 6.30 మధ్యలో ప్రారంభంకానుంది. పోటీ చేసే అభ్యర్థుల భవిష్యత్‌ను మార్చే స్వింగ్ రాష్ట్రాలపైనే ప్రధాన పోటీదారు కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. తమతోపాటు తమ తరఫున ప్రచారం చేస్తున్న వారంతా అక్కడే ఆఖరి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ఓట్లు ఉంటాయి. కానీ ఎలక్టోరల్ సీట్లు ఆధారంగా అధ్యక్షుడు ఎన్నికువుతారు. నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోనప్పటికీ వారు వేసే ప్రతి ఓటూ కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంటే ప్రజలు వేసే ఓట్లను బట్టే ఎవరికి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు వచ్చాయో డిసైడ్ అవుతుంది. ఆయా రాష్ట్రల్లో ఉన్న జనాభాను బట్టి ఆయా రాష్ట్రాలకు ఎలక్టోరల్ సీట్లు కేటాయిస్తారు. ఎక్కువ ఎలక్టోరల్ సీట్లు కాలిఫోర్నియాలో ఉన్నాయి. ఇక్కడ 54 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. తర్వాత స్థానం టెక్సాస్‌ది. ఇక్కడ 40ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. తక్కువ జనాభా ఉన్న వ్యోమింగ్‌లో కేవలం మూడే ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి.
మైన్, నెబ్రాస్కా రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు వస్తాయో వాళ్లకే ఎలక్టోరల్ సీట్లు చెందుతాయి. అంటే ఆ రాష్ట్రాల్లో 50 శాతాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ల ఖాతాలోకి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ సీట్లు చేరిపోతాయి. మొత్తం 538 సీట్లకు 270 వచ్చిన వాళ్లు విజేతలుగా నిలుస్తారు.
అమెరికా ఎన్నికల్లో ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఛేస్ ఒలివర్ అనే అభ్యర్థి లిబర్టేరియన్ పార్టీ నుంచి, జిల్ స్టెయిన్(గ్రీన్‌పార్టీ), రాబర్ట్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. వీళ్లకు ఆయా రాష్ట్రాల్లో వచ్చే ఓట్లు శాతం ట్రంప్, హారిస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉంది.
హోరాహోరీగా సాగుతున్న పోరులో టై అయితే మాత్రం పరిస్థితి వేరే లెక్క ఉంటుంది. ఈ ఎన్నికలతోపాటే జరిగే దిగువసభ, దిగువ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు టై అయితే మాత్రం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఆ రెండు సభలు నిర్ణయిస్తాయి. అధ్యక్షుడిని దిగువ సభ ఎన్నుకుంటే... ఉపాధ్యక్షుడిని ఎగువ సభ ఎంపిక చేస్తుంది.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలలో బెంగాలీ భాష - ఎందుకో తెలుసా ?
పోలింగ్‌కూ ఓ లెక్క ఉంది
నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ కూడా నవంబర్‌లోని మొదటి మంగళవారం జరుగుతుంది. ఇలా నవంబర్‌లోని తొలి మంగళవారం పోలింగ్ నిర్వహించాలని 1845లోనే అమెరికాలో చట్టం చేశారు. అమెరికాలో నవంబర్ నాటికి వ్యవసాయం పనులు పూర్తి అవుతాయి. అందుకే నవంబర్‌ను పోలింగ్‌కు ఎంచుకున్నారు.
కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లో ఎవరు గెలిచినా అమెరికా ప్రెసిడెంట్ అయితే 2025 జనవరి 20న ప్రామాణం చేయనున్నారు. అక్కడి నుంచి నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాలో అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా
అమెరికా అధ్యక్షుడి జీతం
అమెరికా ప్రెసిడెంట్‌కు 4.4 లక్షల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 3.36 కోట్లు జీతం వస్తుంది. అలవెన్సుల చూస్తే... ఖర్చులకు 50,000 డాలర్లు, వినోదం కోసం 19,000 డాలర్లు, వైట్ హౌస్‌లోకి మారేందుకు 100,000 డాలర్లు, పన్ను రహిత ఖర్చుల కోసం 100,000 డాలర్లు పొందుతారు. అమెరికాలో అధ్యక్షుడి జీతం సాధారణ పౌరుడి సగటు జీతం కంటే ఆరు రెట్లు ఎక్కువ. అమెరికన్ ఏటా 63 వేల 795 డాలర్లు (దాదాపు 53 లక్షల రూపాయలు) సంపాదిస్తున్నాడు. ధనవంతుల గురించి చెప్పాలంటే వారి వార్షిక సగటు ఆదాయం 7 లక్షల 88 వేల డాలర్లు అంటే దాదాపు 6 కోట్ల 28 లక్షల రూపాయలు.
Also Read: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?