అన్వేషించండి

US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?

Kamala Harris Vs Donald Trump: కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ట్రంప్, కమలా హారిస్ మధ్య జరుగుతున్న హోరాహోరీలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా ఉంది.

US Presidential Election 2024: ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఈసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ గట్టి పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోరుతో ఉత్కంఠ నెలకొనడంతో ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి అమెరికా వైపే ఉంది. అమెరికాలోని 19 కోట్ల మంది ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇందులో 6.8 కోట్ల మంది ముందుగానే ఓట్లు వేశారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లో ఒకరు గెలవాలంటే 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. 

అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7 నుంచి 9 గంటలకు మధ్య పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు నుంచి అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఇదే భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30లకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రారంభిస్తారు. ఈసారి పోటీ హోరాహోహీ ఉండటంతో ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు రెండు రోజుల సమయం పడుతుందని అంటున్నారు. ఫలితాలు వచ్చినా మిగతా ప్రక్రియ పూర్తి అయ్యేసరికి కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ రోజు ఆదివారమైతే మాత్రం 21న ప్రమాణం చేస్తారు. 

స్వింగ్‌ రాష్ట్రాలపై ఆశలు

7 స్వింగ్ రాష్ట్రాల ఫలితాలు అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరో నిర్ణయిస్తాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకే ఆఖరి నిమిషం వరకు ఈ రాష్ట్రాలనే లక్ష్యంగా చేసుకొని ఇరువురు ప్రచారం నిర్వహించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళ కమలా హారిస్. అదే సమయంలో, డోనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

50 రాష్ట్రాలు ఉన్న  అమెరికాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఉన్నాయి. ఎలక్టర్లను పోటీ చేసే పార్టీలు ముందుగానే నిర్ణయిస్తాయి. బ్యాలెట్‌ పేపర్‌పై ప్రజలు అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ ఓట్లు ఎలక్టర్లకు వెళ్లినప్పటికీ ఎవరికి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎక్కువ వస్తే వాళ్లు గెలిచినట్టు లెక్క. ఎక్కువ ఓట్లు ఉన్న కాలిఫోర్నియాలో కమల్‌ హారీస్‌కు 50శాతాని కంటే ఎక్కువ  ఓట్లు వస్తే అక్కడ 54 ఎలక్టోరల్‌ ఓట్లు ఆమె సొంతమవుతాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అలా ఎవరు 270 ఎలక్టోరల్‌ కాలేజీ సీట్లు గెలుచుకుంటారో వాళ్లే అధ్యక్షులు అవుతారు. 

అమెరికాలో 270 ఎలక్టోరల్ కాలేజీలు వచ్చిన వారు అధ్యక్షుడు అవుతారు. 54 కాలేజీలతో కాలిఫోర్నియా టాప్‌లో ఉంటే... మూడు ఎలక్టోరల్‌ ఓట్లతో వ్యోమింగ్‌ ఉంది. 50 రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలు అంటారు. అవి నెవడా(6), నార్త్‌ కరోలినా(16), విస్కాన్సిన్‌(10), జార్జియా(16), పెన్సిల్వేనియా(19) , మిషిగన్(15), ఆరిజోనా(11). ఈ రాష్ట్రాల్లో మొత్తం 93 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 

స్వింగ్ స్టేట్స్ (ఎన్నికల ఫలితాలు మార్చే ప్రాంతాలు) నుంచి వచ్చిన డేటా పరిశీలిస్తే మాత్రం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉందని స్పష్టం అవుతోంది. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో మాత్రం కమలా హారిస్ స్వల్పంగా ముందంజలో ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల సర్వే ఫలితాలు ఏంటో ఓ సారి చూద్దాం.

సర్వేల్లో ఏం తేలింది?
ఎన్‌బిసి న్యూస్ (అక్టోబర్ 29-నవంబర్ 1) నిర్వహించిన సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 49-49 శాతం ఓట్లు సమానంగా వచ్చాయి.

ఎమర్సన్ కాలేజీ (అక్టోబర్ 29-నవంబర్ 1) నిర్వహించిన సర్వేలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 49-49 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.
ఇప్సోస్ (ABC న్యూస్, అక్టోబర్ 28-31) నిర్వహించిన సర్వేలో, ఉపాధ్యక్షుడు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య 3 శాతం గ్యాప్ ఉంది, ఇందులో కమలా హారిస్ 49 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా, ట్రంప్ 46 శాతం ఓట్లతో వెనుకబడి నట్టు చెబుతున్నారు. 

అయితే అట్లాస్ ఇంటెల్ నిర్వహించిన సర్వేలో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ 2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. 50శాతంతో ట్రంప్‌ ముందంజలో ఉంటే... హారిస్‌కు 48 శాతం వస్తాయని అంచనా.
స్వింగ్ రాష్ట్రాలపై పోల్ డేటా స్టేట్స్

రాష్ట్రం కమలా హారిస్ ఓట్ల శాతం డోనాల్డ్ ట్రంప్ ఓట్ల శాతం
నెవాడా                                46                                         49
నార్త్ కరోలినా    48     46
విస్కాన్సిన్     49     47
జార్జియా      48     47
పెన్సిల్వేనియా    48    48 
మిచిగాన్     47     47
అరిజోనా     45     49

అయోవాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ 47 శాతం ఆధిక్యంలో ఉన్నారని తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేను "నకిలీ", "తప్పుదోవ పట్టించేది" అని ట్రంప్ తిరస్కరించారు. తన ప్రత్యర్థికి అనుకూలంగా ఈ సర్వే జరిగిందని చెప్పారు. కీలకమైన ఎన్నికల ప్రాంతమైన పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, "నా శత్రువుల్లో ఒకరు నేను మూడు పాయింట్ల తేడాతో వెనుకబడి ఉన్నానని తెలిపే పోల్‌ విడుదల చేశారు. మీరు అయోవాలో అద్భుతం చేయబోతున్నారు. రైతులు నన్ను ప్రేమిస్తారు, నేను వారిని ప్రేమిస్తున్నాను.

నవంబర్ 5న ఎన్నికలకు ముందు ట్రంప్, హారిస్ ఇద్దరూ ముగింపు ప్రసంగాలు చేస్తున్న సమయంలో 'డెస్ మోయిన్స్ రిజిస్టర్' వార్తాపత్రిక ఈ సర్వే నిర్వహించింది. సెప్టెంబరులో ఇదే వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో హారిస్ కంటే ట్రంప్ నాలుగు పాయింట్లు ముందున్నారని తేలింది. జూన్‌లో, ప్రెసిడెంట్ జో బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నప్పుడు, ట్రంప్ 18 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఇటీవలి సర్వేల ప్రకారం, మహిళలు, స్వతంత్ర ఓటర్ల మద్దతు కారణంగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హారిస్ రేసులో ముందంజలోకి వచ్చారు. 

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలలో బెంగాలీ భాష - ఎందుకో తెలుసా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget