Working From Pub: అబ్బే వర్క్ ఫ్రమ్ హోమ్ పాత పద్ధతండి బాబు, వర్క్ ఫ్రమ్ పబ్ చాలా బెటర్ - ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Working From Pub: బ్రిటన్‌లో వర్క్ ఫ్రమ్ పబ్ ట్రెండ్ మొదలైంది.
Work From Pub:
బ్రిటన్‌లో మొదలైన ట్రెండ్..
కొవిడ్ సంక్షోభం మొదలైన కొన్నాళ్లకే చాలా రంగాల్లో మార్పులు వచ్చాయి. అంతకు ముందు ఎప్పుడూ లేని మార్పులకు జనాలు అలవాటు పడాల్సి వచ్చింది. అలా ఐటీ రంగంలో Work From Home విధానం వచ్చేసింది. అంతకు ముందు కూడా ఈ వర్క్ కల్చర్ ఉన్నప్పటికీ...పెద్దగా వినియోగించుకుంది లేదు. అందరూ తప్పకుండా ఆఫీస్‌లకు వెళ్లే పనులు చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే కరోనా భయం మొదలైందో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్లాయి ఐటీ సంస్థలు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఇదే విధంగా పని చేసుకున్నారు ఉద్యోగులు. చెప్పాలంటే...WFHకి వాళ్లు బాగా అలవాటు పడిపోయారు. ఈ మధ్యే కొన్ని సంస్థలు ఆఫీస్‌లకు వచ్చేయండి అంటూ ఉద్యోగులకు కబురు పంపుతున్నాయి. కానీ...కొందరు ఉద్యోగులు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. అవసరమైతే...వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే కంపెనీకి మారిపోతాం కానీ...ఆఫీస్‌కు మాత్రం వచ్చేది లేదని కాస్త గట్టిగానే చెబుతున్నారు. ఈ గొడవ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుండగానే...ఇప్పుడు కొత్త వర్క్ కల్చర్ వచ్చేసింది. సింపుల్‌గా బార్‌లో కూర్చుని ఆఫీస్ పని చేసుకోవచ్చు. "ఏంటి బార్‌లోనా..?" అని అలా ఆశ్చర్యపోకండి. నిజమే...- యూకేలో Work From Pub (WFP) వర్క్ కల్చర్‌ని తీసుకొచ్చేశారు. అలా స్టార్ట్ చేశారో లేదో..వెంటనే వైరల్ అయిపోయిందీ పని విధానం. ఎంతగా అంటే...అందరూ పబ్‌లో కూర్చుని పని చేసేందుకే ఇష్టపడుతున్నారు. నిజానికి..ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొందరు ఉద్యోగులు రెస్టారెంట్‌లు, బార్స్, కాఫీ షాప్‌లలో కూర్చుని ఎంచక్కా ఆఫీస్ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు పబ్‌లోనూ కూర్చుని ప్రశాంతంగా పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు.
స్పెషల్ డిస్కౌంట్‌లు..
బ్రిటన్‌లో పలు కంపెనీలు Work From Pub చేసుకోవచ్చని ఉద్యోగులకు చెప్పాయి. ఇంకేముంది..వాళ్లంతా ఇళ్లను వదిలి నచ్చిన పబ్‌లో, బార్‌లో కూర్చుని పని చేసేస్తున్నారు. ప్రస్తుతానికి బ్రిటన్‌లో పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమైంది. ఈ వింటర్ వచ్చే నాటికి పరిస్థితులు మరింత దిగజారుతాయని అంచనా వేస్తున్నారు. అందుకే..కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఆఫీస్‌లు పెట్టుకుని భారీగా ఖర్చు పెట్టే బదులు..ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ పబ్ ఇచ్చేస్తే బెటర్ అని నిర్ణయించుకున్నాయి. అటు పని జరిగిపోతోంది. ఇటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గిపోతోంది. కొన్ని పబ్‌లు ఈ ఎంప్లాయిస్ కోసం స్పెషల్ డిస్కౌంట్‌లు కూడా ఇస్తున్నాయి. ఒక్క రోజుకి 11 డాలర్లు చెల్లిస్తే...లంచ్‌తో పాటు నచ్చిన డ్రింక్ కూడా తాగొచ్చు. ఇంకొన్ని 17 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. ఇక టీ, కాఫీ అలవాటు ఉన్న వారికైతే అన్‌లిమిటెడ్‌గా అందించేస్తున్నాయి పబ్‌లు. క్లైంట్స్ కోసం ఎదురు చూస్తూ...ఇలా డిస్కౌంట్‌లతో గాలం వేస్తున్నాయి. ప్రమోషన్‌తో పాటు బిజినెస్ కూడా ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్ వాసులు చాలా తక్కువగా ఖర్చు చేసేందుకే ఇష్టపడుతున్నారు. అందుకే...వాళ్ల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ప్యాకేజ్‌లు అందిస్తున్నాయి పబ్‌లు. ఏదేమైనా...ఇప్పుడీ ట్రెండ్ అక్కడ బాగానే వర్కౌట్ అవుతోంది. ఇది లాభసాటిగా అనిపిస్తే...బహుశా కొన్ని కంపెనీలు ఈ ట్రెండ్‌ను కంటిన్యూ చేసే అవకాశమూ లేకపోలేదు.
Also Read: Gambia Child Deaths: కాఫ్ సిరప్‌ల గుట్టు తేల్చేందుకు ప్రత్యేక ప్యానెల్, సూచనల తరవాతే తదుపరి అడుగులు