Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు
Chamoli Earthquake Telugu News: ఉత్తరాఖండ్ లోని చమోలిలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాత్రివేళ కావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని సమచారం.
Uttarakhand Chamoli Earthquake: ఉత్తరాఖండ్‌లోని చమోలిలో భూకంపం సంభవించింది. చమోలీలో ఆదివారం రాత్రి (జులై 7న) రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల భూమి కంపించింది. రాత్రివేళ కావడంతో చమోలి ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చమోలీలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని భావిస్తున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరాఖండ్ లోని చమోలిలో జులై 7న రాత్రి 09:09 గంటల ప్రాంతంలో పలుచోట్ల భూమి కంపించింది. ఇది స్వల్ప భూకంపమేనని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. గత నెలలో లడఖ్‌లోని లేహ్‌లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జనవరి 2024లో ఉత్తరకాశీలో కూడా భూకంపం సంభవించడం తెలిసిందే. రియాక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 2.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Earthquake of magnitude 3.5 strikes Chamoli, Uttarakhand: National Center for Seismology pic.twitter.com/sIquOXgO7x
— ANI (@ANI) July 7, 2024