By: Ram Manohar | Updated at : 30 Aug 2023 04:29 PM (IST)
ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్ ని తొలిసారి ఫొటో తీసి పంపిందని ఇస్రో వెల్లడించింది. (Image Credits: ISRO)
Pragyan Rover Latest Images:
ఇస్రో అప్‌డేట్..
చంద్రయాన్ 3 కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది ఇస్రో. చంద్రుడి సౌత్‌పోల్‌పై ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి డేటాని పంపిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్‌ని (Lander Vikram) ఫొటో తీసి పంపింది. నావిగేషన్ కెమెరాతో ఈ ఫొటో క్లిక్ చేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన తరవాత ప్రజ్ఞాన్ రోవర్ తీసిన తొలి ఫొటో ఇదే. ఇప్పటి వరకూ అక్కడి నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోలు అన్నీ ల్యాండర్ విక్రమ్ తీసినవే. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేసింది.
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE— ISRO (@isro) August 30, 2023
"Image of the Mission" అంటూ పోస్ట్ చేసింది. రోవర్‌పై ఉన్న NavCams (నావిగేషన్ కెమెరా)ని బెంగళూరుకి చెందిన Electro-Optics Systems కంపెనీ తయారు చేసింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి కీలక వివరాలు అందిస్తోంది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో ఎవరి వద్దా లేని అత్యంత అరుదైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇటీవలే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
Chandrayaan-3 Mission | ISRO shares an image of Vikram Lander clicked by Pragyan Rover this morning. The image was taken by the Navigation Camera onboard the Rover (NavCam). pic.twitter.com/WYG0VPZzfy
— ANI (@ANI) August 30, 2023
ప్రజ్ఞాన్ రోవర్ లోని లిబ్స్ గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ స్ట్రుమెంట్ సహాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో. అన్నింటికంటే ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవంపై సల్ఫర్ నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అంత కంటే అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలను కూడా గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, సిలికాన్, టైటానియం నిల్వలను ధృవీకరించింది. హైడ్రోజన్ ను వెతికే పనిలో ఉన్నామని ప్రకటించిన ఇస్రో... అందుకు సంబంధించిన రెస్పాన్స్ వేల్ లెంత్ గ్రాఫ్ ను విడుదల చేసింది. చంద్రుడి సౌత్ పోల్ పై ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ ఏంటి అనే విషయాలపై ఇప్పటివరకూ ఫార్ అవే అబ్జర్వేషన్స్ తప్ప ఇన్ సైటూ సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్ ఏ దేశం చేయకపోగా ఆ ఘనత సాధించిన తొలి స్పేస్ ఏజెన్సీగా ఇస్రో..తొలి దేశంగా భారత్ పేరు సంపాదించనట్లైంది.
Also Read: ట్విటర్‌పై పగబట్టిన మాజీ ఉద్యోగులు, ఎలన్ మస్క్‌కి తప్పని చిక్కులు
PM Modi tour: ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్-వచ్చే వారం మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన
ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని కొట్టించిన టీచర్, యూపీలోనే మరో సంచలనం
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
India-Canada Row: కెనడా వివాదంపై నోరు విప్పని భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
/body>