Viral Video: ట్రాక్‌పై కారు...దూసుకొచిన ట్రైన్ - వెంట్రుకవాసిలో ప్రాణం నిలబెట్టుకున్నాడు - ఒళ్ల గగుర్పొడిచే వీడియో
Great Escape: సినిమా చూపించే ఉత్కంఠభరిత సన్నివేశాలు అప్పుడప్పుడూ నిజంగా జరుగుతాయి. అలాంటిదే ఇది. ఓ కారు రైల్వే ట్రాక్ పై ఆగిపోయింది. ట్రైన్ దూసుకొచ్చింది.

Man Narrowly Escapes As He Jumps out Seconds Before Train Slams Into SUV Terrifying Video Surfaces: రైల్వే ట్రాక్ మీదకు రాగానే కారు ఆగిపోతుంది. డోర్ లాక్ అయిపోతుంది. ఎదురుగా రైల్ వస్తూ ఉంటుంది. అప్పుడే అసలు ఉత్కంఠ స్టార్ట్ అవుతుంది. ఓ వైపు రైలు దూసుకొస్తూ ఉంటుంది...మరో వైపు కారు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. చివరికి రైలు వచ్చి కారును ఢీకొట్టే చివరి క్షణంలో హీరో బయటకు దూకుతాడు కారు ముక్కలవుతుంది కానీ మనిషి బయటపడతాడు.
ఇలాంటి సన్నివేశాలను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. ఈ సీన్ తీయడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. ఎన్నో షాట్లు తీయాల్సి ఉంటుంది. అదే సమయంలో గ్రాఫిక్స్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ లేకుండా నిజంగానే ఇలాంటి ఘటన జరిగితే ఒళ్లు గగుర్పొడుస్తుంి. జరిగింది కూడా. వీడియోలో కూడా రికార్డు అయింది. అమెరికాలోని లేటన్ అనే నగరంలో జరిగింది ఈ ఘటన.
🇺🇸UTAH: DRIVER JUMPS OUT SECONDS BEFORE TRAIN SLAMS INTO SUV
— Mario Nawfal (@MarioNawfal) February 12, 2025
In Layton, Utah, on February 4, a white SUV stopped at a crossing was rear-ended, pushed onto the tracks, and trapped by the crossing arms.
The driver managed to escape just moments before a train crashed into the… pic.twitter.com/jIWuN5pNeu
అమెరికాలో రైల్వే క్రాసింగుల దగ్గర గేట్లు ఉండవు. వాహనదారులే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే అలర్ట్ వస్తుంది. కానీ కారు సహకరించకపోవడంతో బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని నివారించవచ్చు కానీ డ్రైవర్ పారిపోయాడని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
I see at least 2 options to avoid collision. This driver took the worst imaginable one. pic.twitter.com/1SgCrY6rqz
— Cpt.J4ck (@Cptjack887) February 12, 2025
కొంత మంది కావాలనే చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
For all the haters out there, please watch the video more closely. Yes, the driver could simply have driven forward and cleared the tracks then continued on their merry way.
— Nicephore_42 (@Nicephore_42) February 12, 2025
However, they had stopped with plenty of space ahead of them, they got rear-ended quite brutally and were…
ఎలా జరిగినా మొత్తంగా ఆ కారు మాత్రం తునాతునకలు అయింది. ఆ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ వీడియో వైరల్ అయింది.
Also Read: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

