Telangana Ration Card: తెలంగాణలో రేషన్‌కార్డు దరఖాస్తులపై కీలక అప్‌డేట్- కంగారు పడొద్దని అధికారుల సూచన
New Ration Card In Telangana: తెలంగాణలో రేషన్ కార్డులపై గందరగోళం కొనసాగుతోంది. దరఖాస్తు చేసిన వాళ్లే పదే పదే చేయొద్దని అధికారులు చెబుతున్నారు. అయినా జనం ఆగడం లేదు.

New Ration Card In Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం జనం ఎగబడుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో అసలు ఖాళీ ఉండటం లేదు. గతంలో వివిధ మార్గాల్లో అప్లై చేసిన వాళ్లు కూడా దరఖాస్తు చేయడానికి క్యూలైన్‌లలో ఉంటున్నారు. దీని వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోందు. ఈ సమయంలో అధికారులు కీలక సూచనలు చేశారు. కంగారుపడొద్దని ప్రజలకు హితవు చెబుతున్నారు.
చాలా కాలం తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. అందుకే వాటి కోసం జనం బారులు తీరుతున్నారు. నౌ ఆర్ నెవర్ అన్నట్టు జనాలు ఎగబడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ మార్గాల్లో అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ప్రజాపాలన పేరుతో నిర్వహించిన సభల్లో పాల్గొన్న చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. తర్వతా ఏర్పాటు చేసిన గ్రామసభల ద్వారా కూడా మరికొందరి నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. మొన్నీమధ్య నిర్వహించిన కులగణన సర్వేలో కూడా ప్రత్యేక కాలమ్ పెట్టారు. రేషన్ కార్డులేని వాళ్లను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
ఇన్ని విధాలుగా ఇప్పటికే అర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అయితే ఏదైనా కారణంతో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోని వాళ్లు ఉంటే మరోసారి అప్లై చేసుకోవాలని సూచించింది. మీ సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చని కూడా చెప్పుకొచ్చింది. దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే అప్లై చేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.
Also Read: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
ఒక్కచోట కాకపోతే మరో మార్గం ద్వారా అప్లికేషన్ పరిశీలించకుండా పోతారా అన్న దృష్టితో అంతా ఎగబడుతున్నారు. వివిధ మార్గాల్లో అప్లై చేసినప్పటికీ మరోసారి మీ సేవ కేంద్రం ద్వారా అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మీ సేవ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్‌లు కనిపిస్తున్నాయి.
అందుకే అధికారులు కీలక ప్రకటన చేశారు. అసలు ఇది ఒక్కసారితో పూర్తి అయ్యే ప్రక్రియ కాదని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దరఖాస్తులు తీసుకుంటామని అంటున్నారు. అందుకే ఎవరూ కంగారు పడి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే ఆలోచన వద్దని అంటున్నారు. ఇలా ఎగబడటంతో మొత్తం ప్రక్రియే ఆలస్యం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకరే పదే పదే దరఖాస్తులు చేయడం వల్ల డూప్లికేషన్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. ఇది కూడా ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం కాగలదని చెబుతున్నారు.
అందుకే ఇప్పటికే దరఖాస్తు చేసున్న వాళ్లు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా కారణంతో ఇప్పటి వరకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోని వాళ్లు, ఇప్పటికే ప్రకటించిన జాబితాలో పేర్లు లేని వాళ్లు మాత్రమే మీ సేవ కేంద్రంలో అప్లై చేయాలని సూచిస్తున్నారు. మిగతా వాళ్లు రావద్దని సూచిస్తున్నారు.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ఎవరు అప్లై చేయాలి? అధికారులు ఏమంటున్నారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

