Ration Card Telangana: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ఎవరు అప్లై చేయాలి? అధికారులు ఏమంటున్నారు?
Ration Card Telangana: కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పడంతో అంతా పరుగులు పెడుతున్నారు. అయితే ఎవరు దరఖాస్తు చేయాలి?

New Ration Card Telangana List 2025: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు పరుగులు పెడుతున్నారు. మీసేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా చాలా మంది మళ్లీ మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు. ఎవరు దరఖాస్తుచేయాలో ఎవరు అవసరం లేదో ప్రభుత్వం క్లియర్‌గా చెప్పినప్పటికీ ఎవరూ ఆగడం లేదు. దీంతో మీ సేవ కేంద్రాలు జనంతో నిండిపోతున్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో జనం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోతున్నామని చెప్పడంతో అవకాశాన్ని వదులుకోకూడదని పరుగులు పెడుతున్నారు. ప్రజాపాలన పేరుతో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది.
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అధికారులు వడపోత ప్రారంభించారు. ఆయా మండలాల నుంచి వాటిని తెప్పించుకుంటున్నారు. వారి ఆధార్ నెంబర్‌ను బేస్ చేసుకొని వాటిని స్క్రీట్నీ చేస్తున్నారు. ప్రజాపాలన తర్వాత గ్రామ సభలు నిర్వహించిన అధికారులు అర్హుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు.
Also Read: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్- అలాంటి వారికి రేషన్ లేనట్టే
ఇలా రెండు మార్గాల్లో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఇంకా అర్హులు ఉండి ఉంటే మీ సేవ కేంద్రాల ద్వార అప్లై చేసుకోవాలని చెప్పారు. ఈ మేరకు మీ సేవ కేంద్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఇలా మీ సేవ కేంద్రాల ద్వార దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో మళ్లీ ప్రజలంతా మీ సేవ కేంద్రాల వెంట పడుతున్నారు. దరఖాస్తు చేసిన వాళ్లే మళ్లీ అప్లై చేస్తున్నారు. అవసరం లేదని చెబుతున్నప్పటికీ వారు వినిపించుకోవడం లేదు. అందుకే అధికారులు మరోసారి ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలనలోకానీ, గ్రామసభల్లో కానీ ఒకసారి దరఖాస్తు చేసిన వాళ్లు మళ్లీ అప్లై చేయాల్సిన పని లేదని పదే పదే చెబుతున్నారు.
ఇలా వచ్చిన వాళ్లే మళ్లీ మళ్లీ రావడంతో మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచే అక్కడకు జనం చేరుకుంటున్నారు. ప్రతి మీ సేవ కేంద్రంలో పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. అక్కడ వారిని కంట్రోల్ చేయడం మీ సేవ కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి తలకు మించిన భారం అవుతుంది.
Also Read: మీకు రేషన్ కార్డు లేదా? ఇలా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం





















