Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన!
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటన జారీ చేసింది. బీఆర్ఎస్ గా గుర్తిస్తూ సర్టిఫికేట్ జారీ చేసింది ఈసీ.
తిరుపతిలో నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృశ్యం
Tirupati News : తిరుపతిలో నలుగురు విద్యార్థులు మిస్ అయిన ఘటన కలకలం రేపుతుంది. తిరుపతి నగరంలోని మంగళం బి.టి.ఆర్ కాలనీకి చెందిన నలుగురు బాలురు కనిపించకుండా పోయారు. బుధవారం ఉదయం స్కూల్ కు బయలుదేరిన విద్యార్థులు స్కూల్ కి వెళ్లలేదు. మంగళం జెడ్పీ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న నాని చరణ్, మోహిత్ లతో పాటు ఆరో తరగతి చదివే లోకేష్, ఎనిమిదో తరగతి చదువుతున్న వెంకటేష్ లు మిస్ అయ్యారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీలు పరిశీలించిన పోలీసులు మొదట విద్యార్థులు కపిల్ తీర్థం వెళ్లి అక్కడి నుంచి లీలా మహల్ సర్కిల్ కు చేరుకున్నట్లు గుర్తించారు. ఆ తరువాత విద్యార్థులు ఎటు వెళ్లారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందకుమార్ నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే సింహయాజీ విడుదల కాగా మిగిలిన ఇద్దరు ఇవాళ రిలీజ్ అయ్యారు. రామచంద్ర భారతి, నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులుండటం వలన వీరిద్దరూ చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
ఫాంహౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్‌కు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతోపాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.

టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు