అన్వేషించండి

Tips for A Healthy Lifestyle : మీ ఇంట్లో ఆ ఒక్క మార్పు చేస్తే.. శారీరక, మానసిక ప్రయోజనాలు మీవే

Organized Room Benefits : మీ మానసిక, శారీరక ఆరోగ్యంలో క్లీనింగ్, ఆర్గనైంజింగ్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా? మీరు మీ రూమ్​ని ఆర్గనైజ్​ చేసుకుంటే ఎన్ని ఫలితాలు పొందవచ్చో తెలుసా?

Benefits of Being Organized : మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని ప్రదేశాలకు లేదా.. కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుకన్న ఓ మెయిన్ రీజన్ ఏంటంటే.. ఆర్గనైజింగ్​గా ఇల్లు ఉండడమే. కొందరు ఇంటిని చాలా శుభ్రంగా పెట్టుకుంటారు. దానివల్ల శారీరకమైన, మానసికమైన ప్రయోజనాలు కూడా వారు పొందుతారు. దానిని మీరు అభువించాలంటే.. గజిబిజిగా ఉండే మీ రూమ్​ని మంచిగా క్లీన్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో.

ఇంటిని క్లీన్​గా ఆరోగ్యంగా పెట్టుకునేందుకు కాస్త శ్రద్ధ చూపిస్తే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు హాయిగా మీ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇది మీకు మంచి వ్యాయామంగా కూడా పని చేస్తుంది. మీరు సంతోషంగా, రిలాక్స్​గా ఉండడంలో రూమ్​ క్లీనింగ్​ ముఖ్యపాత్ర పోషిస్తుంది. నెగిటివిటీ లేకుండా పాజిటివ్​గా ఉండేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒత్తిడి తగ్గుతుంది..

గజిబిజిగా ఉండే గదులు మీపై మరింత ఒత్తిడిని పెంచుతాయి. ఒత్తిడి వల్ల శారీరక, మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఇది మిమ్మల్ని తెలియకుండానే అయోమయానికి గురిచేస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉందో అనే ఒత్తిడిని బాగా పెంచుతుంది. కాబట్టి వాటిని క్రమద్ధీకరించడం కోసం మీరు మీ సమయాన్ని కేటాయించండి. ఏది ఎక్కడ ఉండాలనుకుంటారో.. అక్కడే వాటిని ప్లేస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో మీ పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. తీసిన వస్తువు తీసిన ప్లేస్​లో పెట్టే అలవాటు చేసుకోండి. ఇది చూసేందుకు చాదస్తంగా ఉన్నా కూడా ఇది మీలో స్ట్రెస్​ని తగ్గిస్తుంది. 

నిద్రపోయేందుకు..

మీ రూమ్ చిందవందరగా ఉంటే మీకు నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి వీలైనంత క్లీన్​గా మీ రూమ్, బెడ్​ ఉండేలా చూసుకోండి. మీ గదిలో వస్తువులు కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తాయని మీరు గుర్తించుకోవాలి. చిందరవందరమైన గది మిమ్మల్ని నిద్రపై దృష్టి పెట్టడంలో ఇబ్బందులకు గురిచేస్తుంది. రూమ్ సర్దుకోవాలి అనే ఆలోచన కూడా మీకు నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి మీ రూమ్​ని నీట్​గా సర్దుకోవడంలో అస్సలు వెనకాడకండి. 

ఫుడ్ విషయంలో..

మీరు ఆర్గనైజింగ్ అంటే ఓన్లీ రూమ్​ మాత్రమే అనుకోకండి. ఫుడ్ విషయంలో కూడా మీరు దీనిని ఫాలో అవ్వొచ్చు. ఏ సమయానికి ఏది తినాలి.. ఏ రోజు ఏది వండుకోవాలి అనేది మీరు ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఏమి తింటున్నారు? ఏమి ప్రిపేర్ చేసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేదానిపై అవగాహన పెరుగుతుంది. హెల్తీ ఫుడ్ తినడంలో ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ఎక్కువ తినకుండా.. హెల్తీగా మీ డైట్​లో ఏమి చేర్చుకోవచ్చు అనే విషయాలపై మీకు క్లారిటీ వస్తుంది. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీకు వంట చేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. కొందరు కిచెన్ శుభ్రం చేయలేక బయట ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

క్రియేటివిటీ పెరుగుతుంది..

మీరు క్లీన్, ఆర్గనైజ్డ్​ వర్క్​ స్పేస్​లో ఉన్నప్పుడు మీ పనిపై మీరు మరింత దృష్టి పెట్టవచ్చు. ఇది మీ ఏకాగ్రతకు ఇబ్బంది కలుగకుండా చేస్తుంది. దీనివల్ల మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అదే మీరు చిందవందరమైన పని ప్రాంతంలో ఉంటే మీకు చిరాకు పెరుగుతుంది. అది కాస్త వర్క్​పై ప్రభావం చూపిస్తుంది. 

రిలేషన్స్​పై ప్రభావం..

చూసేందుకు సిల్లీగా ఉంటుంది కానీ.. పరిశుభ్రత అనేది మీ రిలేషన్స్​పై ప్రభావం చూపిస్తుందనేది వాస్తవం. ఇది శారీరక, జీవనశైలి రెండింటిపై ఎఫెక్ట్​ చూపిస్తుంది. పని చేసే ప్రాంతంలోనే కాదు.. ఇంట్లో కూడా ఆర్గనైంజింగ్​గా లేకుంటే అది మీ రిలేషన్స్​పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 

కాబట్టి కుదిరనప్పుడల్లా మీరు రూమ్​ని క్లీన్ చేసుకుని ఆర్గనైజింగ్​ పెట్టుకోండి. రూమ్​ శుభ్రంగా పెట్టుకోవడం అంటే ఎవరికోసమో కాదు.. మన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఆర్గనైజ్​ చేసుకోవాలి. ఇది మీ రోజూవారీ జీవితాన్ని కాస్త సులభతరం చేస్తుంది. 

Also Read : పిల్లల మెదడును యాక్టివ్​ ఉంచేందుకు ఇలాంటి క్రియేటివ్ పనులు చేయించండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget