News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ రాకుండా అందుబాటులోకి దేశీ వ్యాక్సిన్ Cervavac, దీని ధర ఎంతంటే...

ఎక్కువ మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు

FOLLOW US: 
Share:

Cervical Cancer Vaccine: ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా వస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ రెండు మహిళల్లో అత్యంత ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లుగా చెబుతున్నారు వైద్యులు. ఇది లైంగికంగా సంక్రమించే ఒక అంటు వ్యాధి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంది. లైంగికంగా చురుగ్గా ఉంటున్న మహిళల్లో యాభై ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందిలో ఈ వైరస్ వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో కొంతమందికి అది క్యాన్సర్ గా మారుతుంది. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా అవసరం. మొదటిసారి ఈ వ్యాక్సిన్‌ను దేశి సంస్థ తయారు చేసింది.

పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ Cervavac పేరుతో  వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోకూడా ఈ వ్యాక్సిన్లు ఉండే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ రెండు నుంచి మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో డోసు ధర ప్రస్తుతం 2000 రూపాయలు.

ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో 27 శాతం మంది మనదేశంలోనే ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ కచ్చితంగా ప్రతి మహిళా వేయించుకోవాలి. మన దేశంలో ప్రతి ఏడాది లక్షా ఇరవై మూడు వేల కొత్త గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదు అవుతుంటే, 77 వేల మంది ఈ క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ HPV వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. 30 నుండి 60 సంవత్సరాల మధ్య గల ప్రతి ఒక్క స్త్రీ HPV పరీక్షను అప్పుడప్పుడు చేయించుకోవాలి. దీని వల్ల ఈ వైరస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయ కణాలను ప్రభావితం చేసే ప్రాణాంతక వ్యాధి. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వస్తుందని ముందే చెప్పుకున్నాం. ఈ వైరస్‌లలో 100 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్న మహిళల్లో ఈ వైరస్‌... గర్భాశయ క్యాన్సర్‌గా మారడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. ఇక బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న మహిళల్లో కేవలం ఐదు నుండి పది సంవత్సరాల లోనే ఈ వైరస్ కారణంగా క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది.

HPV టీకాను తీసుకోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 90 శాతం మేరకు ఈ వ్యాక్సిన్ తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులు. తొమ్మిది నుంచి 26 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు మహిళలు ఖచ్చితంగా ఈ టీకాను తీసుకోవాలి. అబ్బాయిలకు కూడా ఈ టీకాను ఇవ్వడం మంచిదే. 27 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసుగల మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే వైద్యుని సలహా మేరకు తీసుకోవడం మంచిది. అయితే గర్భిణీ స్త్రీలు ఇతర రకాల వైద్య పరిస్థితిలో అలర్జీలు ఉన్నవారు. ఈ వ్యాక్సిన్ ను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఈ వ్యాక్సిన్ తీసుకోకపోవడం మంచిది. ఇప్పటికే HPV వైరస్ బారిన పడినవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ముందుగానే తీసుకుంటే మంచిది. ఈ వాక్సిన్ జీవితాంతం రక్షణ కల్పిస్తుంది. 

Also read: అనూరిజమ్‌తో చిన్న వయసులోనే మరణించిన ప్రఖ్యాత బాడీబిల్డర్, ఏమిటి అనూరిజమ్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 05 Jul 2023 10:20 AM (IST) Tags: Cervical Cancer Desi vaccine Cervavac Cervical cancer Symptoms Cervical cancer causes Cervical cancer women

ఇవి కూడా చూడండి

Honey: తేనె నిజమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

Honey: తేనె నిజమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

Hair Loss: మీ షాంపూలో ఈ పదార్థాలు ఉంటే జుట్టు రాలిపోవడం ఖాయం!

Hair Loss: మీ షాంపూలో ఈ పదార్థాలు ఉంటే జుట్టు రాలిపోవడం ఖాయం!

HIV Vaccine: గుడ్ న్యూస్- హెచ్ఐవీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్- వచ్చే ఏడాదికి ఫలితాలు

HIV Vaccine: గుడ్ న్యూస్- హెచ్ఐవీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్- వచ్చే ఏడాదికి ఫలితాలు

Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

Alzheimer's:  మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు

Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279