అన్వేషించండి

Ugadi Special Chalimidi Recipe : తెలుగు సంవత్సరాది రోజున.. ట్రెడీషనల్​ స్వీట్​ తినాలనుకుంటే టేస్టీ చలివిడి చేసేయండి

Tasty and Traditional Sweet Recipe : తెలుగు సంవత్సరంలో అసలైన తెలుగు స్వీట్​ తీనాలనుకుంటే కచ్చితంగా చలివిడి చేసుకోవాలి. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం కూడా.

Ugadi 2024 Special Food Recipes : శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది వచ్చేసింది. పండుగరోజున అనేక పిండివంటలు చేసుకుంటూ ఉంటారు. అయితే తెలుగు సంవత్సరాది రోజున.. తెలుగు స్వీట్​ చేసుకోవాలంటే చలివిడి బెస్ట్ ఆప్షన్. దీనిని చేయడం కూడా చాలా సింపుల్ కానీ.. ఇది మంచి రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని కేవలం పండుగలకే కాదు.. వివిధ శుభకార్యాలకు కూడా ఈ టేస్టీ రెసిపీని చేసుకుంటారు. ఇప్పుడంటే ఈ చలివిడి చేసుకోవడం తగ్గింది కానీ.. అప్పట్లో దీనికుండే డిమాండే వేరు. ఈ ఉగాది పండుగరోజున.. పిల్లలకు ఆనాటి రుచిని తినిపించాలనుకుంటే కచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రైచేయాలి. దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

రేషన్ బియ్యం - రెండున్నర కప్పులు

నెయ్యి - రెండు చెంచాలు

జీడిపప్పు - 20

కొబ్బరి ముక్కలు - పావు కప్పు

బెల్లం - కప్పు

పంచదార – పావు కప్పు

నీరు - అరకప్పు

యాలకుల పొడి - చిటికెడు

తయారీ విధానం

రేషన్ బియ్యాన్ని రాత్రి కడిగి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఈ చలివిడి చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. అయితే మామూలు బియ్యం తీసుకోకూడదా అంటే.. తీసుకోవచ్చు. కానీ దానికంటే రేషన్ బియ్యంతోనే చలివిడి బాగా వస్తుంది. ఉదయాన్నే బాగా నాని బియ్యాన్ని కడిగి.. ఓ పది నిమిషాలు నీరు పోయేలా ఆరబెట్టుకోవాలి. అలా అని పూర్తిగా డ్రై కానివ్వకూడదు. ఎక్కువ సేపు ఆరిపోతే చలివిడికి తగ్గట్లు పిండి రాదు. పది నిమిషాలు బియ్యం ఆరిన తర్వాత.. వాటిని మిక్సీలో వేసుకుని పిండిగా చేసుకోవాలి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇలా చేసుకున్న పిండిని జల్లెడతో జల్లించుకోవాలి. అప్పుడు రవ్వగా ఉండే బియ్యం పైన ఉండిపోతుంది. మెత్తటి పిండిని చలివిడికి ఉపయోగించుకోవచ్చు.

మెత్తని పిండిని ఆరకుండా.. అంత దగ్గరగా చేసి ఉంచాలి. ఇలా ఉంటే పిండి తడి ఆరదు. బియ్యమే కాదు.. పిండి కూడా కాస్త తడిగానే ఉండాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఓ కడాయిని ఉంచండి. దానిలో నెయ్యి వేసి వేడి అయ్యాక దానిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు వీటిని వేయించుకుని స్టౌవ్ ఆపేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరో మందపాటి గిన్నె తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో బెల్లం తురుము, పంచదార వేయాలి. అరకప్పు నీళ్లు కూడా వేసి దానిని ఉడకనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగి.. తీగపాకం మారేవరకు తిప్పుతూనే ఉండాలి. అది సరైన పాకం అయ్యిందో లేదో సింపుల్ టెస్ట్​తో తెలుసుకోండి. పాకాన్ని కొంచెం తీసుకుని నీటిలో వేయాలి. పాకం కలిసిపోకుండా.. ఉండ మాదిరిగా వస్తే పాకం సిద్ధమైనట్లు అర్థం. ఇలా సిద్ధమైన పాకంలో.. బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఒకేసారి వేయకూడదు. మధ్యలో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని పిండిని కలుపుతూనే ఉండాలి. పిండిని వేస్తూ.. కాస్త గట్టిగా అయ్యేవరకు గరిటతో తిప్పుతూనే ఉండాలి. అంతే టేస్టీ టేస్టీ చలివిడి రెడీ. దీనిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు.

అయితే పూర్వం రోజుల్లో దీనిని ఇత్తడి గిన్నెల్లో చేసేవారు. గంగాలం అనే పెద్ద గిన్నెలో పాకం పట్టి.. ఒకరు పిండి వేస్తుంటే.. మరొకరు గిన్నె పట్టుకుని.. మరొకరు గరిటతో తిప్పుతూ దీనిని సిద్ధం చేసేవారు. పండుగల సమయంలో.. ఇతర ఫంక్షన్లకు, వివిధ కార్యక్రమాల సమయంలో శారెగా పెట్టేందుకు ఈ చలివిడిని చేసేవారు. ఇది వెన్నెముకకు మంచిదని చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఉగాదికి ఈ టేస్టీ, హెల్తీ చలివిడిని చేసి.. ఇంటిల్లిపాదికి తినిపించేయండి.

Also Read : ఉగాది స్పెషల్ ప్రసాదం పూర్ణం బూరెలు, గారెలు.. టేస్టీగా రావాలంటే ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget