By: ABP Desam | Updated at : 23 Jul 2021 10:54 AM (IST)
కరోనా
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా సగటున రోజుకు 40 వేల కేసులు వస్తున్నాయి. కొత్తగా వస్తోన్న కొవిడ్-19 కేసుల్లో డెల్టా రకం వైరస్ అత్యధికంగా కనిపిస్తోంది. ఈ వైరస్‌కు సంబంధించిన ఇతర ఆందోళనకర రకాల వ్యాప్తి తక్కువగా ఉంది.
ఇన్సాకాగ్ నివేదిక..
కరోనా జన్యుక్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్షియం ఇన్సాకాగ్ ఈ విషయాన్ని తెలిపింది. డెల్టా ఉప రకాల్లోనూ దీన్ని మించిన శక్తి కలిగిన రకాలు ఉన్నట్లు ఆధారాలేమీ లేవని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఆగ్నేయాసియా సహా అనేక ప్రాంతాల్లో కొవిడ్ విజృంభణకు ఇదే కారణమవుతోందని తెలిపింది. అయితే వేగంగా టీకాలు వేస్తున్న, బలమైన ప్రజారోగ్య చర్యలు చేపడుతున్న సింగపూర్ వంటి చోట్ల పరిస్థితి మెరుగ్గా ఉంటోందని వివరించింది. భారత్‌లో కరోనా రెండో ఉద్ధృతికి డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
నివేదికలో ముఖ్యాంశాలు..
75% వాటా డెల్టాదే..
భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, బ్రిటన్ సహా అనేక దేశాల్లో గత నాలుగు వారాల్లో వెలుగు చూసిన కరోనా కేసుల్లో 75 శాతం డెల్టా రకం వల్లే ఉత్పన్నమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.
Dark Chocolate: డార్క్ చాక్లెట్లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక
Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?
Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు
నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి
పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!