Coconut: స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదా .. కొడితే ఏమవుతుంది!
Dharma Sandehalu: కొబ్బరికాయను స్త్రీలు కొట్టకూడదా? కొడితే ఏమవుతుంది? ఇది ప్రచారమా - వాస్తవమా? ఇందులో నిజమెంత?

Coconut: హిందూ ధర్మంలో ఎన్నో ఆచారాలున్నాయి. వాటిని ఆచరించేవారు ఆచరిస్తారు...పట్టించుకోని వాళ్లు అస్సలు వాటి జోలికి కూడా పోరు. అయితే వదిలేసిన వారి సంగతి సరే..పట్టించుకుని అనుసరించే వారు దానివెనుకున్న కారణం తెలుసుకుంటున్నారా? కారణం తెలిస్తే పర్వాలేదు కానీ పూర్తి కారణం తెలియకపోతే అనవసర ప్రచారాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు అనడం. ఇంతకీ స్త్రీలు నిజంగానే కొబ్బరికాయ కొట్టకూడదా? కొడితే ఏమవుతుంది?
హిందూ ధర్మంలో కొబ్బరికాయను శుభప్రదంగా భావిస్తారు. పూజలు, ధార్మిక కార్యక్రమాలు, వివాహాలు, ముహూర్తాలు సహా ఏ శుభకార్యం అయినా కొబ్బరికాయ లేకుండా పూర్తికాదు. దీన్ని పవిత్ర ఫలంగా భావిస్తారు. అయితే ఇంట్లో పెద్దవారు.. స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదని తరచూ చెబుతుంటారు. అలా ఎందుకంటారంటారనే సందేహం చాలా మందికి వస్తుంది కానీ..పెద్దవారు చెప్పారుకదా అని ఫాలో అయిపోతారు. అనుసరించడం మంచిదే కానీ కారణం తెలుసుకోవడం ఇంకా మంచిది.
సనాతన ధర్మంలో ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పూజలు లేదా ఏదైనా శుభకార్యాల సమయంలో సాధారణంగా పురుషులే కొబ్బరికాయ కొడతారు. కానీ స్త్రీలు కొట్టరు..సాధారణంగా కొబ్బరిని ఓ విత్తనంగా భావిస్తారు. దాన్ని పగులకొడితే ఆ ప్రభావం గర్భాశయంపై పడుతుందని చెబుతారు. ముఖ్యంగా ఈ నియమాన్ని పాటించాల్సింది గర్భిణి స్త్రీలు మాత్రమే. ఎందుకంటే గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ ప్రభావం లోపలున్న బిడ్డపై పడుతుంది. పైగా పొట్టలో ఉన్న చిన్నారి కూడా బీజమే కదా..కొబ్బరి కాయ కొడితే చెడు జరుగుతుందని భావిస్తారు. ఇప్పటికీ ఈ పద్ధతిని చాలామంది అనుసరిస్తుంటారు.
కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టడం అంటే...మనలో ఉన్న అహంకారాన్ని వదిలేసి తెల్లని స్వచ్ఛమైన మనసుని ఉంచడమే అని చెబుతారు. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా ..పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా విశ్వసిస్తారుయ మనిషిలో అహాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరి కాయను కొట్టడం వెనుక పరమార్ధం. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు.
కొబ్బరిపై ఉన్న పెంకు అహానికి ప్రతీక అంటారు అందుకే. కొబ్బరి నీళ్లు శ్రేష్టమైనవి కాబట్టే భగవంతుడిని నివేదిస్తారు, అభిషేకం చేసేందుకు వినియోగిస్తారు. కొబ్బరికాయ కుళ్లిపోతే ఏదో అశుభం జరుగుతుందని చాలా మంది భయపడతారు. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇలా జరిగినప్పుడు ఏదైనా చెడు జరుగుతుందనే ఆలోచన ఉంటే పూజలోంచి లేచి కాళ్లు కడుక్కుని తిరిగి నిర్మలమైన మనసుతో భగవంతుడికి నమస్కరించి పూజ కొనసాగించండి. ఎలాంటి కీడు జరగదు.ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దు. అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టం అంటారు కదా ఇది నిజమే అంటారు పండితులు. మీరు మనసులో ఏం కోరుకుని కొబ్బరికాయ కొట్టారో.. అది నెరవేరుతుందనేందుకు సూచన ఇది అని చెబుతారు. కొత్తగా పెళ్లయిన వారు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వస్తే వారికి సంతాన భాగ్యం ఉంటుందని బలంగా విశ్వశిస్తారు.
ఇవన్నీ కేవలం విశ్వాసాలు మాత్రమే..అందుకే వీటిని పరిగణలోకి తీసుకుని అతిగా ఆలోచించవద్దు, భయాలూ వద్దు. నిర్మలమైన మనసుతో భగవంతుడికి నమస్కరిస్తే అంతా మంచే జరుగుతుంది.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

