Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా వాసులకు బిగ్ అలర్ట్- సాయంత్రం వరకు బయటకు వెళ్లొద్దు!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మూడు గంటల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను అలర్ట్ చేసిందా సంస్థ. ప్రభావిత జిల్లాలకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కొన్ని రోజులు భిన్నమైన వాతావరణం ప్రజలను తెగ ఇబ్బంది పెడుతోంది. ఓవైపు ఎండ మంటపెడుతూనే మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలను విపత్తు నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ ఇచ్చింది. సాయంత్రం వరకు ఈ జిల్లాల్లో భారీగా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
రాగల మూడు గంటలు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 15, 2025
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు అప్రమత్తంగా ఉండాలి.
చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.
-రోణంకి కూర్మనాథ్, ఎండి,
విపత్తుల నిర్వహణ సంస్థ. pic.twitter.com/oaXFHgfmpE
ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు చెప్పారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ టైంలో బయటకు రావద్దని తెలిపారు. పనులు ముందే ముగించుకొని ఇంటికి చేరాలని చెబుతున్నారు. ఎత్తైన చెట్ల కింద ఉండటం ప్రమాదంని హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండొద్దని సూచిస్తున్నారు.
వచ్చే మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉంటుందని అధికారలు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ అన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పిడుగులు పడే ప్రమాదం ఉన్న జిల్లాల జాబితాను సోమవారమే అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ పనుల్లో కేర్ తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది?
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది. అదే టైంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాత్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లా
16వ తేదీ ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాత్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్
17వ తేదీ ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్,





















