By: Arun Kumar Veera | Updated at : 15 Apr 2025 09:52 AM (IST)
కొత్త వడ్డీ రేట్ల వివరాలు ( Image Source : Other )
SBI And HDFC Bank Lowers Interest Rates: ట్రంప్ టారిఫ్‌ల (Trump tariffs) ముప్పు &భారతదేశ ఆర్థిక వ్యవస్థ (Indian economy)లో వేగం పెంచడానికి RBI తీసుకొచ్చిన సంస్కరణల మధ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు పెద్ద ఉపశమనం ప్రకటించింది. "బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు"ను (EBLR) 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. తద్వారా, తన ప్రస్తుత & కొత్త హోమ్ లోన్ కస్టమర్ల రుణాలను మరి చవకగా మార్చింది. ఈ కొత్త కోత తర్వాత, రెపో రేటుతో అనుసంధానమైన గృహ రుణ రేటు 0.25 శాతం తగ్గి 8.65 శాతానికి చేరుకుంది. రెపో రేటుతో అనుసంధానమైన ఇతర రుణ రేట్లు కూడా 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గింది.
SBI సవరించిన కొత్త రేట్లు ఈ రోజు (మంగళవారం, ఏప్రిల్ 15, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాల్లో భాగంగా, గత వారంలో, ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపో రేటును (RBI Repo Rate) 0.25 శాతం తగ్గించింది. RBI నిర్ణయం తరువాత, బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌హోల్డర్లకు షాక్
స్టేట్ బ్యాంక్, తన ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల, SBI డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.10 శాతం తగ్గించి 0.25 శాతానికి చేరుకున్నాయి. ఈ కొత్త రేటు అమలు తర్వాత, 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.10 శాతం తగ్గి 6.70 శాతానికి చేరుకుంది. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి గల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు కూడా 7 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రైవేట్ రంగంలోని HDFC బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను (Interest rates on HDFC Bank savings accounts) 0.25 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత కొత్త రేట్లు 2.75 శాతంగా మారాయి, ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఇది అత్యల్పం. ఇప్పుడు, రూ. 50 లక్షలకు పైగా డిపాజిట్లపై వడ్డీ రేటు మునుపటి 3.50 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 12, 2025 నుంచి అమలులోకి వచ్చింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను (Bank of India home loan interest rates) 0.25 శాతం (25 bps) తగ్గించింది. వెహికల్ లోన్, వ్యక్తిగత రుణం, తనఖా రుణం, విద్యా రుణం, రివర్స్ మార్టిగేజ్ రుణం తీసుకునేవాళ్లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. 7.30 శాతం వార్షిక వడ్డీ రేటును అందించే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారికి, కొత్తగా తీసుకునే వాళ్లకు క్రెడిట్ స్కోర్ ఆధారంగా 7.90 శాతం నుంచి వార్షిక వడ్డీరేటు ప్రారంభం అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM), తన 'రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్ల'ను 25 బేసిస్ పాయింట్లు 0.25% తగ్గించింది. దీంతో బ్యాంకు వడ్డీ రేటు (Bank of Maharashtra interest rates) 9.05 శాతం నుంచి 8.80 శాతానికి దిగొచ్చింది. గృహ రుణం 7.85 శాతం నుంచి, వాహన రుణం 8.20% నుంచి స్టార్ట్ అవుతాయని BOM వెల్లడించింది.
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!