Before Marriage OTT Streaming: ఏడాది తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Before Marriage OTT Platform: యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బిఫోర్ మ్యారేజ్' మూవీ దాదాపు ఏడాది తర్వాత 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Naveena Reddy's Before Marriage Movie OTT Streaming On Amazon Prime Video: ప్రస్తుతం ట్రెండింగ్‌కు అనుగుణంగా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ప్రముఖ ఓటీటీలు దూసుకెళ్తున్నాయి. రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్నీ జానర్లలోనూ కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నాయి. చిన్న సినిమాలను సైతం సడన్‌గా స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
ఏడాది తర్వాత ఓటీటీలోకి
బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేని చిన్న సినిమాలు ఆ తర్వాత ఓటీటీల్లో వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. గతేడాది విడుదలైన తెలుగు మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవీనరెడ్డి, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బిఫోర్ మ్యారేజ్' (Before Marriage) మూవీ గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు 14 నెలల తర్వాత ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ రెడ్డి అటుకుల దర్శకత్వం వహించగా.. నాగమహేష్, సునీత మనోహర్, సుప్రియ కీలక పాత్రల్లో నటించారు. యువత తొందరపాటుతో తప్పటడుగులు వేస్తే జీవితం ఎలా తలక్రిందులవుతుందనేదే ఈ సినిమాలో చూపించారు.
స్టోరీ ఏంటంటే?
ధరణి (నవీనరెడ్డి) ఇంజినీరింగ్ చదువు కోసం పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. శాంతి, ప్రశాంతి అనే ఇద్దరితో కలిసి రూంలో ఉంటుంది. అయితే, సిటీ వాతారణానికి అలవాటు పడి ముగ్గురు స్నేహితురాళ్లు తప్పుదారి పడతారు. చెడు వ్యసనాలకు అలవాటై పెళ్ల కాకుండానే ధరణి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదే టైంలో ఆమె ప్రియుడు మోసం చేస్తాడు. దీంతో ధరణి ఏం నిర్ణయం తీసుకుంటుంది?, ఆమె జీవితంలో జరిగిన మార్పులేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.






















