Telangana Politics: కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు రెడీ!: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు విసిగిపోయారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామం అంటున్నారని.. ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా.. మహిళలు, నిరుద్యోగులు, రైతులు అన్ని వర్గాలవారు అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని పేర్నొన్నారు. కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని.. తాను దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో ఇకమీదట చూపిస్తా అన్నారు. వరంగల్ సభ సన్నాహక సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















