![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jabardasth Latest Promo: రష్మీ, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ
Rashmi Gautam - Jabardasth Nookaraju: రష్మీ గౌతమ్, కమెడియన్ నూకరాజు మధ్య గొడవ జరిగింది. అది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో! 'జబర్దస్త్'లో ఆ గొడవను క్లోజ్ చేయాలని నూకరాజు ట్రై చేస్తున్నాడు.
![Jabardasth Latest Promo: రష్మీ, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ Jabardasth Latest Promo Rashmi Gautam Fight With Jabardasth Nookaraju July 12th 13th Episodes Jabardasth Latest Promo: రష్మీ, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/6b561de9ac61f97088908f65e58993241720587279787313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jabardasth Nookaraju is trying to patch things up with Rashmi Gautam: జబర్దస్త్ కావచ్చు లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు... కామెడీ కోసం చేసే ప్రయత్నాలు ఒక్కోసారి కొందరికి కోపం తెప్పించే ప్రమాదం లేకపోలేదు. స్టేజి మీద ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణం అయ్యే అవకాశం ఉంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో అదే జరిగింది. ఎవరి క్రష్ ఏమిటి? అని ఒక ఎపిసోడ్‌లో ఒక టాస్క్ చేశారు. అందులో రష్మీ గౌతమ్, 'జబర్దస్త్' నూకరాజు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దాని గురించి 'జబర్దస్త్'లో ప్యాచప్ చేసే ప్రయత్నం చేశాడు నూకరాజు.
ఆ ఇంట్లో గొడవలకు ఈ ఇంట్లో అలక ఎందుకు చిలక!
రష్మీ గౌతమ్ క్రష్ గురించి 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో అడిగాడు నూకరాజు. అప్పుడు 'మీరు నా గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు?' అని రష్మీ గౌతమ్ టోన్ మార్చి అడిగింది. 'మా పర్సనల్ డౌట్స్ మీకు ఎలా ఉంటాయో అలాగే మీ పర్సనల్ డౌట్స్' అని నూకరాజు అడగబోతే... ''అది మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ను అడగాలి'' అని రష్మీ గౌతమ్ అనడంతో నూకరాజు స్టేజి దిగేశాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ గురించి 'జబర్దస్త్'లో ప్రస్తావించాడు నూకరాజు.
''ఇక్కడ నేను తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఆగండి. అసలు తప్పు నీది కాదు, నాది కాదు... అమ్మది (ఇంద్రజను నూకరాజు అమ్మ అంటుంటాడు). ఇలా నిప్పు గీసి పెద్ద మంట పెట్టింది. ఆ మంటలో నువ్వు నేను కాలిపోయాం'' అని రష్మీతో అన్నాడు నూకరాజు. దాంతో కృష్ణ భగవాన్, ఖుష్బూ నవ్వేశారు. ఆ తర్వాత 'నన్ను అనే చనువు నీకు లేదా? నిన్ను అనే చనువు నాకు లేదా? ఆ ఇంట్లో గొడవలకు ఈ ఇంట్లో అలక ఎందుకు చిలక?' అని నూకరాజు అనడంతో రష్మీ గౌతమ్ కూడా నవ్వేసింది.
చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చజూలై 12, 13వ తేదీల్లో టెలికాస్ట్ అయ్యే 'జబర్దస్త్'లో 'ఆటో' రామ్ ప్రసాద్ చేసిన స్కిట్‌లో బామ్మ గెటప్ వేసింది రోహిణి. వృద్ధ ఆశ్రమం నుంచి ఆవిడను రామ్ ప్రసాద్ దత్తత తెచ్చుకుంటాడు. బిర్యానీ అడిగితే తెచ్చి ఇస్తాడు. అందులో చికెన్ ముక్క లేదని, తాను ఆశ్రమానికి వెళతానని రోహిణి గొడవ చేస్తుంది. సరేనని చికెన్ ముక్కతో బిర్యానీ తెస్తారు. తర్వాత గుడ్డు లేదని రచ్చ చేస్తుంది. ఈ స్కిట్ విపరీతంగా నవ్వించేలా ఉంది.
Also Read: ఆహా 'జిలేబి'... ఓటీటీలోకి థియేటర్లలో డిజాస్టర్ ఫిల్మ్, ఆల్మోస్ట్ ఏడాది తర్వాత!
'రాకెట్' రాఘవ, 'బుల్లెట్' భాస్కర్ స్కిట్లు సైతం బావుంటాయని లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. ఇంద్రజను 'ఇందు ఆంటీ' అని భాస్కర్ అనడంతో ఆమెకు ఫోన్ చేస్తానని ఖుష్బూ అనడం బావుంది. భాస్కర్ మీద నరేష్ వేసిన పంచ్ డైలాగ్స్ కూడా పేలాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)