Bhairavana Kone PaaTa: కన్నడలో మరో భారీ పీరియాడిక్ ఫిల్మ్ - Shiva Rajkumar లుక్కు చూశారా, పెద్ద ప్లానింగే!
Shiva Rajkumar New Movie: కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ హేమంత్ రావు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భైరవన కోనే పాఠ'. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Bhairavana Kone PaaTa First Look Poster: కరుణాడ చక్రవర్తి, శాండిల్ వుడ్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆ సినిమా పేరు ఏమిటి? దానికి దర్శకుడు ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే...
'సప్త సాగరాలు దాటి' దర్శకుడితో...
రక్షిత్ శెట్టి హీరోగా రుక్మిణీ వసంత్, చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా వచ్చిన 'సప్త సాగరాలు దాటి' రెండు భాగాలు గుర్తు ఉన్నాయా? ఆ సినిమా దర్శకుడు హేమంత్ ఎం రావు దర్శకత్వంలో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) ఓ సినిమా చేస్తున్నారు. దాని టైటిల్ 'భైరవన కోనే పాఠ'. అంటే... భైరవుని చివరి పాఠం అని అర్థం! లెసన్ ఫ్రమ్ ఏ కింగ్... అనేది ఉప శీర్షిక. మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో భైరవగా టైటిల్ పాత్రలో శివ రాజ్ కుమార్ కనిపించనున్నారు.
Also Read: ఆహా 'జిలేబి'... ఓటీటీలోకి థియేటర్లలో డిజాస్టర్ ఫిల్మ్, ఆల్మోస్ట్ ఏడాది తర్వాత!
After Jailer @NimmaShivanna BREAKS THE INTERNET with his next with Sapta Sagaralu Dhaati Director @hemanthrao11 and @Vaishak_J_Films 🔥🔥🔥#BhairavanaKonePaaTa#BKP #VJF #VaishakJFilms #Shivarajkumar @The_Biglittle #VaishakJGowda pic.twitter.com/qV71cwiWi5
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 10, 2024
కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో!
Bhairavana Kone PaaTa Movie Producer: 'భైరవన కోనే పాఠ' చిత్రాన్ని వైశాఖ జె ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ వైశాఖ్ కె గౌడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు. హిందీలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శివ రాజ్ కుమార్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి అయ్యాక 'భైరవన కోనే పాఠ' సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇయర్ ఎండ్ షూటింగ్ స్టార్ట్ చేయవచ్చని తెలుస్తోంది.
హిస్టారికల్ ఫిలిమ్ కాదు... పీరియాడిక్!
Bhairavana Kone PaaTa Movie Concept: 'భైరవన కోనే పాఠ' ఫస్ట్ లుక్ చూస్తే... ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కులో కనిపిస్తారని అర్థం అవుతోంది. ఆయన కాస్ట్యూమ్స్ సైతం పురాతన కాలంలో ఉన్నట్టు ఉన్నాయి. అయితే... ఈ సినిమా హిస్టారికల్ ఫిల్మ్ కాదని దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. ఇదొక పీరియాడిక్ ఫిల్మ్ అంట! 12వ శతాబ్దంలో కథ సాగుతుందని తెలిసింది.
Also Read: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
#BhairavanaKonePaaTa is a captivating period action drama set in the 12th century.#Shivanna #HemanthRao #DrShivarajkumar
— Bhargavi (@IamHCB) July 10, 2024
▪️The story draws inspiration from William Shakespeare's "Macbeth" and various other historical tales.
▪️The film explores lesser-known tales of ancient… pic.twitter.com/ZkOEY0shiE