Harom Hara OTT: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
Harom Hara OTT Release Date: సుధీర్ బాబు హీరోగా జ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వం వహించిన 'హరోం హర' ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో వస్తుందంటే?
Harom Hara OTT Platform Telugu Release Date: సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హరోం హర'. 'ది రివోల్ట్'... అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సుధీర్ బాబుకు 'నవ దళపతి' అని కొత్త ట్యాగ్ కూడా ఇచ్చారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. రిజల్ట్ సంగతి పక్కన పెడితే... గత నెలలో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ నెలలో ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ఏ ఓటీటీలో, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుంది? అంటే...
జూలై 11 నుంచి ఆహాలో 'హరోం హర'
Harom Hara Digital Premiere On Aha OTT: 'హరోం హర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ 'ఆహా' చేతికి వెళ్లాయి. ఈ నెల (జూలై) 11వ తేదీన డిజిటల్ ప్రీమియర్ (రిలీజ్)కు ఏర్పాట్లు చేశారు.
జూన్ 14న 'హరోం హర' థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు వారాలకు వీక్షకుల (డిజిటల్ ఆడియన్స్) ముందుకు సినిమా వస్తోంది. సుధీర్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమిది. యాక్షన్ సన్నివేశాలను భారీ ఎత్తున తెరకెక్కించారు. అయితే... థియేటర్లలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఎక్కువ మంది ప్రేక్షకులు చూడలేదు. అందువల్ల, ఓటీటీలో మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి.
'హరోం హర'లో ఎవరెవరు నటించారు? క్రూ ఎవరు?
Harom Hara Movie Cast And Crew: 'హరోం హర' చిత్రానికి జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఆయన 'సెహరి' తీశారు. ఈ చిత్రాన్ని సుమంత్ జి నాయుడు ప్రొడ్యూస్ చేశారు. కుప్పం నేపథ్యంలో సెమీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తీశారు.
'హరోం హర'లో సుధీర్ బాబు సరసన మాళవికా శర్మ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర చేశారు. హీరో తండ్రిగా తమిళ నటుడు జయప్రకాశ్ నటించారు. రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ విలన్ రోల్స్ చేశారు. లేటెస్ట్ కాంట్రవర్షియల్ కాండిడేట్, యూట్యూబర్ ఓ పాత్ర చేశారు.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
'హరోం హర' సినిమా కథ ఏమిటి?
కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో సుబ్రమణ్యం (సుధీర్ బాబు) ఉద్యోగి. ఆ ఏరియాలో వెరీ పవర్ ఫుల్ క్యాండిడేట్ తమ్మిరెడ్డి (కేజీఎఫ్ నటుడు లక్కీ లక్ష్మణ్) మనుషులతో గొడవ కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. ఆ తర్వాత అక్రమ ఆయుధాల (తుపాకీల) వ్యాపారం మొదలు పెడతాడు. తమ్మిరెడ్డి మనుషులకు ఆప్తుడు అవుతాడు. అయితే వాళ్ళతో గొడవ ఎందుకు వచ్చింది. సుబ్రమణ్యం తండ్రి శివారెడ్డి (జయప్రకాశ్)ని తమ్మిరెడ్డి కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) చంపాలని ఎందుకు అనుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: దేవసేన సాక్షిగా బయటపడ్డ మంచు బ్రదర్స్ విబేధాలు - అసలు అన్నయ్య విష్ణు పేరెత్తని తమ్ముడు మనోజ్!