అన్వేషించండి

Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?

Who Is Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు మీద చర్యలు తీసుకోవాలని నెటిజనులు, సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల డీజీపీలు స్పందించారు. అసలు ఎవరితను?

Know About Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు... గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ప్రముఖంగా వినబడుతోంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా కొంత మంది ప్రేక్షకులకు అతడు తెలుసు. నటుడిగా మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు గానీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అతని పేరు వైరల్ కావడానికి కారణం ఏమిటి? అతని కుటుంబ నేపథ్యం ఏమిటి? ఏయే సినిమాలు చేశాడు? అనే వివరాల్లోకి వెళితే...  

ప్రణీత్ హనుమంతు వివాదం ఏమిటి?
Praneeth Hanumanthu Controversy: యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు పాపులర్ అయ్యాడు. అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద... తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ... ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్‌ హేయమైన, నీచమైన కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యల పట్ల ప్రజలు నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. హీరో సాయి దుర్గా తేజ్ అందరి కంటే ముందుగా స్పందించాడు. అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ - తెలంగాణ డీజీపీలు స్పందించారు.

Also Read: నా హక్కులు వదులుకునేందుకు సిద్ధం, ఆ ముసుగు తీసేయండీ... ప్రణీత్ హనుమంతు మీద సాయి తేజ్‌ ఫైర్

మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్, 'శశివదనే' నిర్మాత అహితేజ బెల్లంకొండ సైతం ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. అతడి మీద చర్య తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రణీత్ హనుమంతు తండ్రి ఐఏఎస్ అధికారా?
Praneeth Hanumanthu Father and Family Background: ప్రణీత్ హనుమంతు తండ్రి పేరు హెచ్. అరుణ్ కుమార్. ఆయన ఐఏఎస్ అధికారి. మొన్నటి వరకు ఏపీలో సివిల్ సప్లయిస్ అండ్ ఈవో సెక్రటరీగా విధులు నిర్వహించారని సమాచారం. ఆయన 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అని తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aye jude (@ayejude_amigooo)

Praneeth Hanumanthu And Aye Jude Relation: ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యారు. 'ఏ జూడ్' ఛానల్ కొందరికి తెలిసే ఉంటుంది. అందులో కనిపించే వ్యక్తి పేరు అజయ్ హనుమంతు. ప్రణీత్ సోదరుడు. అతడికి సొంత అన్నయ్య.

సినిమాల్లోనూ నటించిన ప్రణీత్ హనుమంతు!
Praneeth Hanumanthu Films List: సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన తాజా సినిమా 'హరోం హర'లో ప్రణీత్ హనుమంతు నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు. 'హరోం హర' కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఒరిజినల్ ఫిల్మ్ 'మై డియర్ దొంగ'లో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు. 'కీడా కోలా' విడుదలకు ముందు దర్శక నటుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రమోషనల్ వీడియో గుర్తు ఉందా? కామెడీ కింగ్ బ్రహ్మానందం గెటప్స్ రీ క్రియేట్ చేశారు. ఆ వీడియో వెనుక సృష్టికర్త ప్రణీత్ హనుమంతే.

Also Read: మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - Netflixలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పట్నించి అంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Praneeth Hanumantu (@p.hanumantu)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Praneeth Hanumantu (@p.hanumantu)

ప్రణీత్ హనుమంతు కొన్ని సినిమాల విడుదలకు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు సైతం చేశారు. 'హాయ్ నాన్న' విడుదలకు ముందు నానితో, 'భజే వాయు వేగం' విడుదలకు ముందు కార్తికేయ గుమ్మకొండతో ప్రణీత్ హనుమంతు స్పెషల్ వీడియోస్ చేశారు. హ్యూమర్ కోసం అతడి వీడియోస్ చూసే కొందరు ఆడియన్స్ సైతం తండ్రీ కుమార్తె బంధం మీద చేసిన వీడియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఫ్యామిలీ మీద కొందరు నెటిజనులు కామెంట్స్ చేయడంతో ప్రణీత్ హనుమంతు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనను తాను సమర్ధించుకుంటూ డార్క్ హ్యూమర్ అని పేర్కొనడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Also Readపవన్‌ కళ్యాణ్‌ను ఏపీ సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Praneeth Hanumantu (@p.hanumantu)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Embed widget