అన్వేషించండి

Family Stars Latest Promo: సుధీర్‌పై ఆర్టిస్టుల కౌంటర్లు - ఒకప్పటి సీరియల్ నటీనటులతో ‘ఫ్యామిలీ స్టార్స్’ 90స్ థీమ్

Family Stars Promo: ఈవారం ‘ఫ్యామిలీ స్టార్స్’లో సీరియల్ స్టార్లు సందడి చేయనున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు సీరియల్స్‌తో అలరిస్తున్న వారంతా మరోసారి ఈ షోలో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు.

Family Stars Latest Promo: సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్స్’ షో మరో ఫన్నీ ఎపిసోడ్‌తో సిద్ధమయ్యింది. తాజాగా ఈ అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఈవారం ‘ఫ్యామిలీ స్టార్స్’.. 90స్ థీమ్‌తో అలరించడానికి సిద్ధమయ్యింది. అంటే 90ల్లో నుండి ఇప్పటివరకు సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటీనటులు ఈవారం ఈ షోకు వచ్చి సందడి చేయనున్నారు. ‘కొంతమందిని నా చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. కొంతమందిని నా టీనేజ్ నుండి చూడడం మొదలుపెట్టాను. కొంతమందిని ఇప్పటికీ చూస్తూనే ఉన్నా’ అంటూ వారందరికీ ఇంట్రో ఇచ్చాడు సుధీర్.

సుధీర్‌పై కౌంటర్లు..

సీరియల్ యాక్టర్ రాగిని ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సుధీర్‌పై జోకులు వేస్తూ అందరినీ నవ్వించారు. ‘ఇక్కడ ఫ్యాన్ లేదు చాలా వేడిగా ఉంది అన్నారు’. వెంటనే సుధీర్ పక్కకు రాగానే ‘గాడిగాడివి పక్కకు వచ్చావు కదా. ఇప్పుడు చల్లగానే ఉంది’ అని కౌంటర్ ఇచ్చారు. ‘నాకెప్పుడూ అనిపిస్తూ ఉండేది. నాకొక కూతురు ఉంటే సుధీర్‌లాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి అని’ అని తన మనసులో మాటను బయటపెట్టారు రాగిని. ‘అబ్బాయి అయినా పర్వాలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు సుమిత్. సెల్వరాజ్ ఫిజిక్ చూసి ‘ఇలా బాడీ పెంచాలంటే ఏం చేయాలి’ అని అడుగుతాడు సుధీర్. ‘నేను కూడా చెమట చిందిస్తాను’ అని సుధీర్ సమాధానమివ్వగా.. ‘నువ్వు చేసే చెమట చిందించడం కాదు’ అని సెల్వారాజ్ కౌంటర్ ఇస్తాడు.

తీర్చుకోలేని రుణం..

టాస్కుల్లో కూడా సీరియల్ ఆర్టిస్టులు పోటాపోటీగా ముందుకెళ్లారు. సెల్వారాజ్, సుమిత్ కలిసి ‘అర్జున్ రెడ్డి’ స్పూఫ్ చేసి అందరినీ నవ్వించారు. రాగిని, హరిత కలిసి నవరాసాలు పండించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నవారంతా ఈటీవీతో తమ అనుబంధం గురించి మాట్లాడారు. ముందుగా హరిత.. ‘కొన్ని రుణాలను తీర్చుకోలేము. జీవితాంతం సేవిస్తూనే ఉండాలి. అలాంటిదే నాకు ఈటీవీ. మా బాబు పుట్టినరోజు, ఈటీవీ పుట్టినరోజు ఒకటే. ఆగస్ట్ 27. రామోజీ రావు ఒక ఛానెల్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి పని ఇచ్చి ప్రతీ ఒక్కరు ఆత్మాభిమానంతో బ్రతకగలిగే ఒక జీవితాన్ని ఇచ్చారు. కళమ్మ తల్లి ఉన్నంతవరకు రామోజీ రావు చిరస్మరణీయులు’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు హరిత.

పడిపోతుంటే పట్టుకుంది..

‘తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటే కేవలం ఈటీవీ వల్లే’ అని మరొక ఆర్టిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నందకిషోర్ సైతం ఈటీవీతో తన అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘నేను ముత్యమంత పసుపు అనే సీరియల్ చేశాను. అందులో బాలసుబ్రహ్మణ్యంతో యాక్ట్ చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. ‘అప్పట్లో ఈటీవీ సీరియల్స్ ఒక బాటవేశాయి’ అని లిరిష అన్నారు. ‘ఈటీవీ నాకొక తల్లిలాంటిది ఎందుకంటే నాకొక తమ్ముడిని ఇచ్చింది’ అని సుమిత్ తెలిపాడు. ‘నేనెప్పుడు పడిపోతున్నా.. నేను ఉన్నాను పట్టుకోవడానికి అంటూ నన్ను ఈటీవీ పట్టుకుంది’ అని సుడిగాలి సుధీర్ సైతం ఈటీవీపై తన ప్రేమను బయటపెట్టాడు. చివరిగా అందరూ కలిసి రామోజీ రావును గుర్తుచేసుకున్నారు.

Also Read: భారతీయుడు గెటప్‌లో కార్తీక్... సైలెంట్ స్కిట్‌తో నవ్వించిన రాఘవ... ‘జబర్దస్త్’ ప్రోమో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget