సుడిగాలి సుధీర్.. మే 19, 1987లో ఏపీలోని విజయవాడలో జన్మించాడు. సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్ బయానా. తండ్రి ఓ సినిమా థియేటర్లో మేనేజర్. సుధీర్‌కు భరత నాట్యం, జానపద నృత్యాల్లో అనుభవం ఉంది. ఇంటర్‌లో ఉండగానే బుల్లితెరపై ఛాన్స్‌ల కోసం హైదరాబాద్ వచ్చేశాడు. ఆరేళ్ల తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. సుధీర్ తొలిసారి ‘మా టీవీ’లో ప్రసారమైన ‘స్టార్ హంట్ వన్ ఛాన్స్’ షోలో వచ్చాడు. ఆ షోలో ఫైనల్ వరకు వచ్చి ఫెయిలయ్యాడు. దీంతో విజయవాడ తిరిగి వెళ్లిపోయాడు. తండ్రికి యాక్సిడెంట్ తర్వాత సుధీర్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కుటుంబం కోసం 2006 నుంచి సుధీర్ రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాజిక్ చేయడం మొదలుపెట్టాడు. 2009లో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం గెటప్ శ్రీను, ప్రదీప్‌లను కలిశాడు. 2011లో అతడికి ‘మా’ టీవీలో ‘మ్యాజిక్ షో’ నిర్వహించే అవకాశం లభించింది. 2013లో ఈటీవీలో మొదలైన ‘జబర్దస్త్’ షోలో అవకాశం దక్కింది. ఆ తర్వాత రష్మీతో స్నేహం మొదలైంది. వేణు టీమ్‌లో ఒకడిగా సుధీర్.. ‘జబర్దస్త్’ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ శ్రీను, రాంప్రసాద్, సన్నీలతో కలిసి ‘సుడిగాలి సుధీర్’ అయ్యాడు. సుధీర్ జబర్దస్త్‌తోపాటు ‘ఢీ’ 9 నుంచి 13 సీజన్లలో టీమ్ లీడర్‌గా కనిపించాడు. ఢీ-14లో మాత్రం అవకాశం రాలేదు. ప్రస్తుతం సుధీర్ సినిమాల్లో నటిస్తూనే.. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ద్వారా అలరిస్తున్నాడు. All Images Credits: Sudigali Sudheer/Facebook