స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మెట్టెలు లేక మట్టెలు. ఒక స్త్రీకి పెళ్లి అయిందా- లేదా అని అడగకుండా తెలుసుకోవటానికి పాదాల వంక చూస్తారు మెట్టెలు ఉన్నాయా? లేవా? అని
గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు రావు.
సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా వత్తిడి కలిగించడంవల్ల ఆ సమస్యలు నివారణ అవుతాయి.
మెట్టెల సాయంతో కాలివేళ్ళకు ఒత్తిడి తగిలించడంవల్ల కామ సంబంధమైన కోరికలు తగ్గుతాయి. సన్యాసులు పావుకోళ్లు ధరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే.
మెట్టెలు పెట్టుకోవడంవల్ల పాదానికి ఒక వింత శోభ వస్తుంది.
వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఇవి భూమిలోని శక్తిని శోషణం చేసుకుని శరీరానికి అందిస్తాయి. దీంతో శరీర వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. శరీరంలోని ప్రతికూలతలను బయటకు పంపుతుంది.
మెట్టెలు ధరించడంవల్ల ''ఈమెకు వివాహం అయింది'' అనే సంకేతం కనిపిస్తుంది కనుక పరపురుషుల వ్యామోహం నుంచి ఓ విధమైన రక్షణ.