బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.



ఈ సినిమాలో ఆమె లుక్స్ కి, నటనకి బాగా ట్రోల్స్ పడ్డాయి.



అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి.



రోజురోజుకి తనను మరింత పెర్ఫెక్ట్ గా మార్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.



ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.



విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది.



ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.



తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఈవెంట్ కోసం చక్కగా ముస్తాబైంది అనన్య.



పింక్ కలర్ ఫ్రాక్ లో ఆమె అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.