11 నుంచి 20వ తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇది..
11వ తేదీ ఆదర్శవాదులుగా ఉంటారు. ఏం విన్నా వాస్తవం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఎదుటివాళ్ల అంతర్గత ఆలోనచలను ముందుగానే తెలుసుకునే సత్తా ఉంటుంది. తోటివారిని మోటివేట్ చేస్తారు. మీరు చాలా సెన్సిటివ్ గా, ఎమోషనల్ గా ఉంటారు.
12వ తేదీ ఈ తేదీన పుట్టినవారిలో కళాత్మక ఎక్కువ. స్టోరీస్, జోక్స్ తో అందర్నీ బాగా నవ్విస్తారు. మీరు ఎక్కడుంటే అక్కడ వాతావరణం ఆహ్లాదరకరంగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం బారిన పడినా తొందరగా కోలుకుంటారు. వెర్బల్, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. యాక్టింగ్ ఫీల్డ్ కూడా మీకు బాగా కలిసొస్తుంది.
13వ తేదీ కుటుంబం, సంప్రదాయాలు, కమ్యూనిటీపై చాలా ప్రేమ ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రతి విషయంలో క్లారిటీ కావాలని కోరుకుంటారు. చాలా కష్టపడతారు. అతిగా పనిచేయడం కూడా మీకు మంచిది కాదని తెలుసుకోండి.
14వ తేదీ 14 వ తేదీన పుట్టిన వారిలో అత్సుత్సాహం ఎక్కువ. ప్రయాణాలు చేయడాన్ని ఇష్టపడతారు. రచయితగా, ఎడిటర్ గా రాణిస్తారు.
15వ తేదీ వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కళాత్మక కూడా ఎక్కువ. విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, కాలిగ్రాఫీ, స్కల్చర్ ని ఇష్టపడతారు. జీవితంలో ది బెస్ట్ ఉండాలని కోరుకుంటారు. మీ జీవితంలో ఇల్లు, మ్యారేజ్ అనేది ప్రధాన సమస్య. మీ భాగస్వామికి మంచి స్పేస్ ఇస్తే సంతోషంగా ఉంటారు.
16వ తేదీ ఈ తేదీన పుట్టినవారికి దేవుడిపై భక్తి ఎక్కువ. చేసేపనిపై ఏకాగ్రత ఉంటుంది. మంచి విలువలు కలిగి ఉంటారు.
17వ తేదీ ఎందరి మధ్య ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారం, ఫైనాన్స్ లో బాగా రాణిస్తారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. జడ్జ్ మెంట్ టాలెంట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ కలిగి ఉంటారు.
18వ తేదీ నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల మ్యానేజర్ గా, బిజినెస్ లో రాణిస్తారు. ఇతరులకు ఇన్సిపిరేషన్ గా ఉంటారు. రాజకీయాలు, ఆర్ట్స్, న్యాయసేవల్లో టాలెంట్ ఉంటుంది. ఆలోచనలు రోజు రోజుకీ మెరుగుపరుచుకుంటారు
19వ తేదీ ఇండివిడ్యవల్ గా ఉండాలని కోరుకుంటారు. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించనంతవరకూ నా లైఫ్ నా ఇష్టం అని గడపాలనే ఆలోచనతో ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మార్పులను చాలా ఇష్టపడతారు.
20వ తేదీ ఈ తేదీన పుట్టిన వారు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఇతరుల ఫీలింగ్స్ ని ఇట్టే గుర్తుపట్టేస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లో సమస్యలు తగ్గుతాయి. ఈ తేదీన పుట్టినవారి ముఖంలో మంచి కళ ఉంటుంది. ప్రేమ పంచడంలో వీరికి వీరే సాటి.
మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఈ ఫలితాల్లో మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…