ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి



ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయట.



ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం.



దేవుడి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గువేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పనిసరిగా గీయాలట.



నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుందట.



ఇంటి ముందు వేసే పద్మం ముగ్గు కేవలం గీతలు కాదు..ఆ ముగ్గువెనుక యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడుశక్తిని ఆపుతుందని చెబుతారు.



దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.



దేవాలయంలో నిత్యం ముగ్గువేసే స్త్రీకి ఏడు జన్మల వరకూ వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తారని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.



నిత్యం ముగ్గులు వేయలేక పెయింట్ లు పెట్టేస్తుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.



ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుందని పెద్దలు చెబుతారు.



ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గువేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు