స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ షేరు ఎప్పుడు మల్టీబ్యాగర్‌గా మారుతుందో తెలియదు! హఠాత్తుగా తెరపైకి వస్తుంటాయి.


తాజాగా ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ మల్టీబ్యాగర్‌గా మారి ఇన్వెస్టర్లకు సంపదను పంచింది.


ఏడాది కాలంలో ఈ షేరు ఏకంగా 11,664 శాతం ర్యాలీ చేసింది.


2020, డిసెంబర్ 8న బీఎస్‌ఈలో రూ.1.53గా ఉన్న షేరు ధర బుధవారం రూ.180 వద్ద ముగిసింది.


అంటే.. ఏడాది క్రితం ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసుంటే ఇప్పుడు రూ.1.17 కోట్లు చేతికి అందేవి.


ఈ మైక్రోక్యాప్‌ స్టాక్‌ బుధవారం ఇంట్రాడేలో రూ.180కి చేరుకొని అప్పర్‌ సర్క్యూట్‌ అయిన 5 శాతాన్ని తాకింది. క్రితం ముగింపు ధర రూ.171 కన్నా ఐదు శాతం అధికంగా ముగిసింది.


ప్రస్తుతం ఫ్లోమిక్‌ గ్లోబల్‌ షేరు 50, 100, 200 మూవింగ్‌ యావరేజెస్‌పైనే ఉంది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.129.60 కోట్లకు పెరిగింది.


ఈ కంపెనీలో ప్రమోటర్లకు 27.49 శాతం వాటా ఉంది. పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల వద్ద 72.51 శాతం వాటా ఉంది. కేవలం 536 వద్ద 52.20 లక్షల షేర్లు ఉన్నాయి.


సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం 17.65 శాతం తగ్గింది. పన్నులు చెల్లించిన తర్వాత లాభం రూ.0.70 కోట్లుగా ఉంది.


2020 సెప్టెంబర్లో రూ.40.08గా ఉన్న విక్రయాలు చివరి క్వార్టర్లో రూ.80.44 కోట్లుగా ఉంది.

Thanks for Reading. UP NEXT

2021 గూగుల్ సెర్చ్ లో టాప్ సినిమా ఇదే..

View next story