మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో ఒక సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైంది. మెగాస్టార్ కు బాబీ వీరాభిమాని. ఆయన అభిమానులు చిరుని తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా చూపించడానికి రెడీ అవుతున్నాడు బాబీ. ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా.. నిమిషాల్లో వైరల్ అవుతోంది. మొన్నామధ్య ఈ సినిమా ప్రీ లుక్ ను విడుదల చేయగా.. అది చూసి కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకువచ్చింది. ప్రీలుక్ ని బట్టి పోర్టులో పనిచేసే కూలీ పాత్రను చిరు పోషిస్తున్నాడని అభిమానులు అనుకున్నారు. కానీ నిజానికి దాని అంతరంగం వేరట. ఇందులో చిరంజీవి అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. ఇంటర్వెల్ వరకు ఊరమాస్ గా కనిపించే చిరు ఆ తరువాత పోలీస్ అవతారంలో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ లైన్ వింటుంటే సినిమాకి పోకిరి టచ్ యాడ్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీలంక నేపథ్యంలో తెరకెక్కించనున్నారు సమాచారం.