శ్రీరామచంద్ర 2005 నుంచి పాటలు పాడుతున్నా రాని గుర్తింపు సింగిల్ కాంపిటేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇండియన్ ఐడియల్ సింగర్ 2010 షో లో విజేతగా నిలిచాడు.



శ్రీరామచంద్ర పూర్తి పేరు మైనంపాటి శ్రీరామచంద్ర. సొంతూరు ప్రకాశం జిల్లా అద్దంకి అయినప్పటికీ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. తండ్రి ప్రసాద్ హైకోర్టులో న్యాయవాది. అమ్మ జయలక్ష్మి గృహిణి. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లేని కుటుంబం అయినప్పటికీ శ్రీ రామ చంద్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు.



ఇండియన్ ఐడియల్ సింగర్ 2010 సమయంలో సంజయ్ దత్, జాన్ అబ్రహం, బిపాసా బసు, కత్రినా, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు శ్రీరామ్ పాటలకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా శ్రీరామ్ పాడిన గెలుపు తలుపులే తీసే ఆనందమే వీడని బంధమే... సాంగ్ మంచి పేరు తీసుకొచ్చింది.



కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ పాటలు పాడాడు.



సింగర్ గా మాత్రమే కాదు నటుడిగా సత్తా చాటిన శ్రీరామచంద్ర 'శ్రీ జగద్గురు ఆది శంకర', 'ప్రేమ గీమ జాన్‌తా నయ్' లో నటించాడు. సల్మాన్‌ఖాన్‌తో కలసి సుజుకీ యాడ్ లో నటించిన శ్రీరామ్...పలువురు నటులకు డబ్బింగ్ కూడా చెప్పాడు.



ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉన్న శ్రీరామ్.. టికెట్ టు ఫినాలే రేసులో తొలి ఫైనలిస్టుగా నిలిచాడు.



బిగ్ బస్ సీజన్ 5 లో ఫస్ట్ ఫైనలిస్ట్ మాత్రమే కాదు విజయానికి చేరువలో ఉన్నాడంటున్నారు అభిమానులు.



సింగర్ శ్రీరామ్ విజేతగా నిలవాలంటూ పలువురు సెలబ్రెటీలు మద్దతు ప్రకటిస్తున్నారు. శ్రీరామ్ విజేతగా నిలవాలని రియల్ హీరో సోనూసూద్ ఆ మధ్య వీడియో రిలీజ్ చేశాడు.



ఈ వీకెండ్ ఒకరు ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ హౌజ్ లో మిగిలేది ఐదుగురే. ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో శ్రీరామ్ నంబర్ వన్. మరి టికెట్ టు ఫినాలే విన్నర్.. టైటిల్ విన్నర్ అవుతాడా.. వెయిట్ అండ్ సీ..