మెరుపుతీగ చీరకడితే... చూసేందుకు రెండు కళ్లూ చాలవు పెళ్లి వార్తతో కత్రినాకైఫ్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. విక్కీతో కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోయినా కేవలం ఒక టాక్ షోలో పాల్గొని అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కత్రినాకైఫ్ పెళ్లి రాజస్థాన్లోని కోటలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కత్రినా వెస్ట్రన్ వేర్లోనే కాదు ట్రెడిషనల్ లుక్ లో కూడా స్టన్నింగ్ గా కనిపిస్తుంది. చీరకట్టులో కుర్రకారును గుండెను పిండేసింది ఈ బ్యూటీ. కత్రినా తండ్రి కాశ్మిరీ కాగా, తల్లి బ్రిటన్ దేశస్థురాలు. తండ్రి పేరు మహ్మద్ కైఫ్, తల్లి పేరు సుసన్నే కైఫ్. 2003లో హిందీ సినిమా ‘బూమ్’ ద్వారా తెరంగేట్రం చేసింది. 2004లో తెలుగులో వెంకటేష్‌తో కలిసి ‘మల్లీశ్వరి’గా మెరిసింది. ఆమె నటకు మొదట్లో విమర్శలే ఎదురయ్యాయి. నటనను మెరుగుపరుచుకుని ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఇప్పుడు ఆమె జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. తాను ప్రేమించిన విక్కీతో పెళ్లికి సిద్ధపడింది. వారి జంట కలకాలం కలిసుండాలని కోరుకుందాం.