చలికాలంలో చర్మం పగలకుండా...
ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే



శీతాకాలంలో చర్మం పొడిబారడం, పగిలిపోవడం, దురద... ఇలా చాలా సమస్యలు మొదలవుతాయి.



కొందరిలో ఇది జిరోసిస్, ఎగ్జిమా, డెర్మటైటిస్, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్స్ మారే అవకాశం కూడా ఉంది.



అందుకే చర్మాన్ని పొడిగా మారకుండా పరిరక్షించుకోవాలి.



ట్యూబులలో అమ్మే మాయిశ్చరైజర్లకు బదులు చిన్న సీసాలలో అమ్మే మాయిశ్చరైజర్లను వాడితే మంచిది. అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి.



మీరు కొనే మాయిశ్చరైజర్లో సెరామిడ్స్, గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆమ్లం, సిలికాన్, మినరల్ ఆయిల్, సోర్బిటాల్ ఉండేలా చూసుకోండి. ఇవి తేమని లాక్ చేసి, చర్మం పొడిబారకుండా కాపాడతాయి.



ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. అయిదు నిమిషాలలోపే స్నానాన్ని ముగించండి.



పెట్రోలియం జెల్లీ ఎల్లప్పుడు మీతో ఉంచుకోండి. చర్మం పొడిగా మారిన వెంటనే ఆయా ప్రాంతాల్లో పూసేయండి.



స్నానం చేసిన వెంటనే తడిని టవల్ తో త్వరగా తుడిచేయండి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లయ్ చేయండి. ఇది తేమను లాక్ చేసి పెడుతుంది.



పొడిచర్మం ఉన్న వాళ్లు సబ్బు వాడకూడదు. సబ్బుతో రుద్దితే మరింతగా సమస్య పెరిగిపోతుంది.



పచ్చి పాలలో దూది ముందు చర్మానికి మర్ధనా చేయండి.