ఈ ఏడాది గూగుల్ అత్యధిక మంది సెర్చ్ చేసిన 'జై భీమ్'. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. హిందీలో వచ్చిన 'షేర్షా' సినిమా గూగుల్ సెర్చ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. సల్మాన్ నటించిన 'రాధే' సినిమా గూగుల్ సెర్చ్ లో మూడో స్థానాన్ని దక్కించుంది. 'బెల్ బాటమ్' సినిమా ఈ ఏడాది విడుదల కాగా.. గూగుల్ సెర్చ్ లో నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ సినిమా 'ఎటర్నల్స్' గూగుల్ సెర్చ్ లో ఐదో స్థానంలో ఉంది. విజయ్ 'మాస్టర్' సినిమాను గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేయగా.. లిస్ట్ లో ఆరోస్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ సూర్యవంశీ సినిమా గూగుల్ సెర్చ్ లో ఏడో స్థానం దక్కించుకుంది. ఆ తరువాత స్థానంలో హాలీవుడ్ సినిమా 'Godzilla vs Kong' చోటు దక్కించుకుంది. మలయాళం 'దృశ్యం 2' సినిమా తొమ్మిదో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ 'భుజ్' సినిమా గూగుల్ సెర్చ్ లో పదో స్థానంలో నిలిచింది.