ఈ విషయాలు బయటివారితో షేర్ చేసుకోవద్దు

పనిచేసే చోట, నివాసముండే ప్రాంతంలో చాలా మంది స్నేహితులుగా దగ్గరవుతారు. వారితో ముఖ్యంగా కింద చెప్పిన విషయాలను పంచుకోకూడదు.

భర్త లేదా భార్యకున్న అలవాట్లు, ఫోబియాల గురించి బయటి వారితో పంచుకోకూడదు. అవి మీ ఇద్దరి మధ్యే రహస్యంగా ఉండాలి.

మనలో చాలా మందికి కొన్ని లక్ష్యాలు, కోరికలు ఉంటాయి. వాటిని సాధించే దిశగా పనిచేయాలే తప్ప, వాటి గురించి అందరితోనూ పంచుకోవడం వల్ల ఉపయోగం లేదు.

మీలో ఉన్న దాతృత్వగుణం గురించి కూడా ఇతరులతో పంచుకోవద్దు.

మీ జీత భత్యాలు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తి వివరాల్లాంటివి పంచుకోవద్దు. స్నేహానికి, పరిచయానికి వాటితో పనిలేదు.

ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో బలహీనత ఉంటుంది. మీ వీక్‌నెస్ గురించి ఇతరులకు చెప్పుకుంటే మీరింకా బలహీనంగా తయారవుతారు.

ప్రతి ఇంట్లోను గొడవలు జరగడం సహజం. పనిచేసే చోట, నివసించే చోట వారితో పంచుకుంటే... ఆ విషయాలు ఒకరి నుంచి ఒకరికి ప్రచారం జరిగిపోతాయి. ఇంటి విషయాలు రచ్చకీడ్చుకుంటే ఇంకా సమస్యలు పెరుగుతాయి.