మెయిన్ డోర్ దగ్గర స్వస్తిక్ సింబల్ పెడితే అంతా శుభమే జరుగుతుందట



సు+ఆస్తిక్ = స్వస్తిక్ అంటే మంచి జరగాలని అర్థం. ఇంట్లో శుభకార్యాల సమయంలో స్వస్తిక్ గీయడం వెనుక అర్థం ఏంటంటే ఆయా కార్యక్రమాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వసిస్తారు.



స్వస్తిక్ చిహ్నం సూర్యుడి గతిని సూచిస్తుందంటారు. అందుకే పూర్వకాలంలో సూర్యుడి పూజలకు చిహ్నంగా ఉండేదట.



ఈ గుర్తును మహాలక్ష్మి ప్రతీకగా కూడా చెబుతారు. లక్ష్మీపూజ చేసే వ్యాపారులు స్వస్తిక్ గీస్తారు



పెళ్లిసమయంలో బాసికం స్వస్తిక్ ఆకారంలో ఉండేది వినియోగిస్తారట కొందరు. వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని శుభసూచకంగా స్వస్తిక్ గుర్తు కడతారట



హిందువులు మాత్రమే కాదు జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం , బుద్ధిజం , జైనిజం, టిబెట్, చైనా, జపాన్, గ్రీస్, అజ్టెక్, సెయ్లాన్, హోపీ, సెల్ట్ , మాల్టా వంటి దేశాల్లో ఈ చిహ్నాన్ని దైవసమానంగా భావిస్తారట.



12వేల ఏళ్ల క్రితం నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు.



ఎడమ వైపుకు తిరిగి ఉండేది లేదా ఎడమ చేతి వాటం ఒకటి.. కుడి వైపు తిరిగి ఉండేది లేదా కుడిచేతి వాటం ఒకటి



ఎక్కువ మంది వినియోగించేది కుడివైపు తిరిగి ఉండే స్వస్తిక్ నే.



స్వస్తిక్, ఓం, త్రిశూలం ఈ మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లో దుష్టశక్తులు పారిపోతాయంటారు.



స్వస్తిక్ ను డోర్ కి అతికిస్తే శుభఫలితాలు ఉంటాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.



పూజా గదిలో స్వస్తిక్ ను ఉంచి పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంటారు



స్వస్తిక్ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జికి చోటు లేదంటారు



గృహప్రవేశాలు,పెళ్ళి పత్రికలు,వాహన పూజలు,నూతన యంత్రాలు వాడే సమయంలో పూజలో స్వస్తిక్ తప్పనిసరిగా కనిపిస్తుంది



ఈ సింబల్ ని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే దృష్టి దోషాలు పోతాయంటారు