ఐశ్వర్యం, ఆరోగ్యాన్నిచ్చే పూలు ఇవి.. చెట్టునుంచి మాత్రం కోయకూడదు, ఎవ్వరి దగ్గర్నుంచీ తీసుకోరాదు
దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లాడట.
ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని కృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి
స్వర్గం నుంచి తీసుకురావడం వల్ల పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు.
పారిజాతం వృక్షం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని అంటారు.
ఈ పూల వాసన ఆరోగ్యం, ఆహ్లాదాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసి నీటితో కలిపి తలకు పెట్టుకుంటే పొక్కులు తగ్గుతాయి.
పారిజాత చుర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకుని పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదంలో కలిపి, సన్నని సెగపై వేడి చేసి వాతపు నొప్పులు ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది.
వీటిఆకుల రసాన్ని నాలుగు చుక్కలను చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గతుంది.
పారిజాతం ఆకులను మెత్తగారుబ్బి రసాన్ని తీసి సన్నని సెగపై సగం అయ్యే వరకు వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే దానిలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. సయాటికా నొప్పి తగ్గిపోతుంది.
గజ్జి, తామర సమస్య ఉన్నవారు పారిజాతం గింజలను కుండపెంకుల్లో మాడ్చి.. మసిగా చేసి కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది.
చాలా మంది ఈ చెట్లను దేవాలయాల్లోనే పెట్టాలి అంటారు కానీ అదేం లేదు ఇళ్లలో పెంచుకోవచ్చంటున్నారు వాస్తు నిపుణులు