అన్వేషించండి

Jabardasth Latest Promo: భారతీయుడు గెటప్‌లో కార్తీక్... సైలెంట్ స్కిట్‌తో నవ్వించిన రాఘవ... ‘జబర్దస్త్’ ప్రోమో

Jabardasth Latest Promo: చాలావరకు రాఘవ అండ్ టీమే తన ప్రత్యర్థులపై గెలుస్తూ వస్తోంది. అందుకే ప్రతీసారి డబుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. తాజాగా విడుదలయిన ప్రోమోలో కూడా రాఘవే హైలెట్ అయ్యారు.

ETV Jabardasth Latest Promo: ‘జబర్దస్త్’లోని ఒకప్పటి కామెడియన్స్ అంతా కలిసి రెండు టీమ్స్‌గా విడిపోయినప్పటి నుండి ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్మెంట్ అందుతోంది. ముఖ్యంగా ఎంట్రీలోనే వీరు విసిరే ఛాలెంజ్‌లు, ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్నాయి. ఇక ఈ వారానికి సంబంధించిన ‘జబర్దస్త్’ ప్రోమో తాజాగా బయటికొచ్చింది. ప్రతీ వారంలాగానే ఈ వారం కూడా తమ ప్రత్యర్థులకు రాఘవ విసిరే ఛాలెంజ్‌తో ఈ ప్రోమో మొదలయ్యింది. ‘నాకు చాలా బాధగా ఉంది. కేవలం 1,2 పాయింట్స్‌తో గెలిచిన వారితో మాకు పోటీ ఏంటి’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు రాఘవ. ‘గెలిచామని అయిపోయింది పట్టుకొని వేలాడతారేంటి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి’ అని ఛాలెంజ్ విసిరారు.

రాఘవ ఛాలెంజ్..

ఈసారి తమ ఛాలెంజ్ రూ. 60 వేలు అని ప్రకటించారు రాకెట్ రాఘవ. తాము మాత్రం రూ. 15 వేలే అని తెలిపాడు బుల్లెట్ భాస్కర్. ‘మాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. బ్యాండ్ బాజా బరాత్. వాయింపే’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు రాఘవ. ఇది విని ఆశ్చర్యపోయిన ఇమ్మాన్యుయేల్... ‘ఎంట్రీ అప్పుడు ఈయనకు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు’ అనగానే అందరూ నవ్వారు. అలా ఎంట్రీతో సందడి పూర్తవ్వగానే... స్కిట్స్‌తో పోటీ మొదలు. ముందుగా చంద్రముఖి, పసుపతి, అరుంధతి లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్‌ను ఇంటర్వ్యూ చేసే నూకరాజ్... తన స్కిట్‌తో అలరించడానికి సిద్ధమయ్యాడు. నూకరాజ్.. ఎలా ఉన్నారు అని అడగగానే.. చంద్రముఖి క్యారెక్టర్‌లో ఉన్న తాగుబోతు రమేశ్... నల్ల ఇరికే అంటాడు. వెంటనే మరొక వ్యక్తి వచ్చి ‘నల్ల ఇరికినప్పుడు అది తీస్తేనే వాటర్ వస్తుంది’ అని కౌంటర్ ఇచ్చాడు.

అత్తగా రోహిణి..

రోహిణి, సన్నీ అత్తమామలుగా... రామ్ ప్రసాద్, దొరబాబు అల్లుళ్లగా స్కిట్ మొదలు. తనది పోస్టర్లు అంటించుకునే ఉద్యోగం అని కామెడీ చేస్తాడు దొరబాబు. వారి కూతుళ్లను చూసి అచ్చం మీ పోలికలే ఉన్నాయంటూ సన్నీతో చెప్తాడు. మీకు ములక్కాడలంటే ఇష్టమా అని రోహిణి అడగగా.. ‘పిప్పి కూడా నమిలేస్తాను’ అని దొరబాబు అంటాడు. తనకు పెద్దగా ఇష్టముండదని రామ్ ప్రసాద్ చెప్తాడు. ‘‘వీడు పిప్పి కూడా నమిలేస్తాడు, వాడు కాడ కాడలాగానే ఉంచేస్తాడు’ అంటూ తన అల్లుళ్ల గురించి వివరిస్తుంది రోహిణి. ఆ తర్వాత మరోసారి తన సక్సెస్ ఫార్ములా స్కిట్‌తో ఎంట్రీ ఇస్తాడు రాఘవ. అదే సైలెంట్ స్కిట్. ఒక పెళ్లిలో దొంగతనానికి వెళ్లిన వ్యక్తిగా అసలు మాట్లాడకుండానే సైలెంట్‌గా కామెడీని పండించారు రాకెట్ రాఘవ అండ్ టీమ్.

చిటిక చాలు..

నరేశ్ డైరెక్టర్‌గా, బుల్లెట్ భాస్కర్ హీరోగా ‘జబర్దస్త్’ స్టేజ్‌పై సినిమా మొదలు. ‘యాక్టింగ్ బాగా చేస్తావా’ అని అడగగా.. ‘చించేస్తా’ అంటూ తన యాక్టింగ్ టాలెంట్ బయటపెడతాడు భాస్కర్. అయినా తను సరిగా యాక్ట్ చేయకపోవడంతో నరేశ్ చేతిలో తన్నులు తింటాడు. ఆ తర్వాత వెంకీ, ఇమ్మాన్యుయేల్ తమ టీమ్ లీడర్స్ గురించి ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటారు. ‘మావయ్యా’ అంటూ ఇమ్యాన్యుయేల్ కాళ్లపై పడిన వర్ష.. కాసేపు అలాగే ఉండిపోతుంది. ‘అదేంటి అంతసేపు ఉంది’ అని అడగగా.. ‘లేకపోతే స్కిట్‌లో పెట్టను’ అనేస్తాడు ఇమ్మాన్యుయేల్. ‘భారతీయుడు’ గెటప్‌లో వచ్చి తన తోటి టీమ్ లీడర్స్‌తో కలిసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు కార్తిక్. చివరికి ప్రత్యర్థులను ఓడించిన రాకెట్ రాఘవ.. ‘వాళ్ల రేంజ్‌కు తోడకొట్టాల్సిన అవసరం లేదు. చిటిక చాలు’ అనడంతో ప్రోమో ముగిసింది.

Also Read: అనసూయతో శేఖర్ మాస్టర్ పులిహోర, ముద్దుపెట్టి షాకిచ్చిన రీతూ.. పాపం, మరీ అన్నిసార్లా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget