అన్వేషించండి

Kiraak Boys Khiladi Girls Promo: అనసూయతో శేఖర్ మాస్టర్ పులిహోర, ముద్దుపెట్టి షాకిచ్చిన రీతూ.. పాపం, మరీ అన్నిసార్లా?

Kiraak Boys Khiladi Girls Promo: జడ్జి స్థానంలో ఉంటూ పోటీపడాల్సిన శేఖర్ మాస్టర్.. అనసూయతో పులిహోర కలపడం మొదలుపెట్టారు. రీతూపై పగ పెంచుకున్న కిరాక్ బాయ్స్.. తనపై రివెంజ్ ప్లాన్ చేశారు.

Kiraak Boys Khiladi Girls Latest Promo: ప్రతీ వీకెండ్ బుల్లితెరపై అలరిస్తున్న షోలలో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ కూడా ఒకటి. మరో వారం మరొక ఎపిసోడ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది ఈ షో. ఇక ఈ వారం ఇందులో పార్టీ థీమ్‌తో సిద్ధమయ్యారు కంటెస్టెంట్స్. ఎప్పుడూ పాము, ముంగిసల్లాగా కొట్టుకుంటూ ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు.. పార్టీ థీమ్ కోసం జంటలుగా వచ్చారు. ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

జంటలుగా పోటీ..

ప్రోమో మొదలవ్వగానే అర్జున్ ప్యాంట్‌పై జోకులు వేసింది విష్ణుప్రియా. ‘‘కంగారులో మా ఆవిడది వేసుకొచ్చాను’’ అంటూ జోక్‌కు స్పందించాడు అర్జున్. ఇక ఈ పార్టీ థీమ్ కోసం రీతూ, చైతూ ఒక కపుల్‌గా వచ్చారు. ‘‘రీతూ.. చైతూ.. ఈ జోడీ తూ. చండాలమైన కాంబినేషన్’’ అంటూ వారిని చూసి స్టేట్‌మెంట్ ఇచ్చింది శ్రీముఖి. తేజ, శోభా జంటగా రావడం చూసి ఊరికే శోభా వెంటే ఎందుకు పడుతున్నావని అడగగా.. ‘‘అమ్మాయిలందరూ నావెంట పడుతున్నారు’’ అని సమాధానమిచ్చాడు తేజ. అది విని అందరూ నవ్వుకున్నారు. అందరూ జంటగా వచ్చినా యాదమ్మరాజుకు మాత్రం ఖిలాడి గర్ల్స్ నుంచి జోడీగా అమ్మాయి లేదు. అందుకే ఇద్దరు అమ్మాయిలను స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు. అది తన భార్య చూడకుండా టీవీ కనెక్షన్ కట్ చేశానని అన్నాడు.

రీతూపై రివెంజ్..

కిరాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్ మాత్రమే కాదు.. గేమ్ ఛేంజర్స్ అయిన అనసూయ, శేఖర్ మాస్టర్ సైతం జోడీగానే వచ్చి స్టెప్పులేశారు. వారి ఎంట్రీ ఇవ్వగానే ‘‘పాట చివరివరకు ఉండాలి. మధ్యలో వెళ్లకూడదు’’ అని అనసూయ అంటుంది. ‘‘ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని పాట చివరివరకు ఉండకుండా ఎలా వెళ్తాను’’ అంటూ అనసూయతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు శేఖర్ మాస్టర్. అది చూసిన శ్రీముఖి.. ‘‘పార్టీ ఉంది అన్నాను. పోటీ లేదు అనలేదు. పులిహోర కలిపింది చాలు’’ అంటూ వారిని వారి సీట్స్‌కు పంపించేసింది. దాంతో సీరియస్‌గా టాస్కులు మొదలయ్యాయి. ఒక టాస్కులో అబ్బాయిలు గెలిచిన ప్రతీసారి రీతూ చౌదరీనే పిలిచి అల్లం రసంతో షాట్స్ తాగించారు. ఆపై ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ దగ్గరకు వచ్చి తన బుగ్గపై ముద్దుపెట్టింది రీతూ. అది చూసి అర్జున్ అసూయపడతాడు.

కిరణ్ సీరియస్..

చివరిగా జంటలు అందరు కలిసి ఒక ఫన్నీ టాస్క్ ఆడతారు. ఆ టాస్కులో విష్ణుప్రియాపై తన అభిప్రాయం ఏంటి అని అర్జున్‌ను అడగగా.. ‘‘మొదట్లో తను యాంకరింగ్‌కు వచ్చినప్పుడు చూసి చాలా చలాకీ అమ్మాయి పైకి వచ్చేస్తుంది అనుకున్నాను. షో అయిపోయిన తర్వాత ఏం లేదు, లోపలంతా డొల్ల’’ అని చెప్పగా విష్ణుప్రియా సైతం జోక్‌గా తీసుకొని నవ్వింది. ఆ తర్వాత కిరణ్‌పై తన అభిప్రాయం ఏంటని శోభా శెట్టిని అడుగుతుంది శ్రీముఖి. ‘‘ఊరికే అనవసరంగా కోప్పడుతున్నారు’’ అని శోభా చెప్తుంది. అది కిరణ్‌కు నచ్చదు. ‘‘పొగరు ఏంటి? కోపం ఏంటి? వచ్చినప్పటి నుంచి వాళ్లందరూ కూడా ఇలా అంటున్నారు. నాకు నచ్చట్లేదు’’ అంటూ కిరణ్ సీరియస్ అవ్వడంతో ప్రోమో ముగిసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also Read: నిత్యానంద, రంజిత వీడియోపై ఆర్జీవీ కామెంట్స్, ఆ హీరో ఆయనకు పెద్ద భక్తుడట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Weather Latest Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్- ఏపీకి పొంచి ఉన్న తుపాను ప్రమాదం 
తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్- ఏపీకి పొంచి ఉన్న తుపాను ప్రమాదం 
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Tirumala Laddu: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Embed widget