ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ, ప్రైవేటు ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రైతులు పత్తిని తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. పత్తికి కనీస మద్దతు ధర ఎంత ఉంది..? రైతులకు ఏం ఇబ్బందులు ఉన్నాయి..? ఈ ఏడాది మార్కెట్ లో ఎంతమేర పత్తి కొనుగోలు జరగనుంది. మార్కెటింగ్ శాఖ ఎంతమెర పత్తి వస్తుందని భావిస్తోంది..? పత్తి రైతులు..మరియు అధికారులు ఏం చెబుతున్నారు..? ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.
Story Voice Over: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా నలుమూలల నుండి రైతులు తాము కష్టపడి సాగుచేసిన పత్తి పంటను తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంట అంతంత మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టిందానికంటే దిగుబడి చాలా తక్కువగా వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల వరకు పత్తి సాగయింది. అయితే అందులో ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంట తీవ్రంగా నష్టపోయింది.