అన్వేషించండి

PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య

Modi Air Craft: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఝార్ఖండ్ పర్యటన అనంతరం ఆయన ఢిల్లీ వచ్చేందుకు సిద్ధపడగా ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ కాలేదు.

Technical Snag In PM Modi Aircraft: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఝార్ఖండ్‌లో (Jharkhand) పర్యటించారు. క్యాంపెయిన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీకి (Delhi) తిరుగు ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్నికల ప్రచారం నిమిత్తం శుక్రవారం ఉదయం ప్రధాని ఝార్ఖండ్‌లో పర్యటించారు. 2 ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్నారు. బిర్సాముండా జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. పర్యటన ముగిసిన అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు దేవ్‌గఢ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, ప్రధాని ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కాలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.

రాహుల్ హెలికాఫ్టర్ సైతం

మరోవైపు, ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ సైతం గంటకు పైగా నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో దేవఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని గోడ్డాలో ఆగిపోయింది. దీంతో ఆయన పర్యటన షెడ్యూల్‌కు ఆటంకం కలిగింది. కాగా, ఝార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగింది. ఈ నెల 20న మహారాష్ట్రతో పాటు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడించనున్నారు.

అమిత్ షా హెలికాఫ్టర్‌లో తనిఖీలు

అటు, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాఫ్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడిస్తూ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. 'ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన క్రమంలో నా హెలికాఫ్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఇందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి.' అని అమిత్ షా పేర్కొన్నారు.

Also Read: Karnataka News: కర్ణాటకలో లిక్కర్ వ్యాపారుల సమ్మెబాట - ఒక రోజు బంద్ - కారణమేమిటంటే ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Marco Rubio India Visit: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన.. వ్యాపారం, ఇంధనం, దౌత్యపరమైన 5 కీలక అంశాలు
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన.. వ్యాపారం, ఇంధనం, దౌత్యపరమైన 5 కీలక అంశాలు
SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?
ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. SBI ఏం చెబుతుందంటే?
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget