అన్వేషించండి

Ammayi garu Serial Today November 16th: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజుల ఫస్ట్‌నైట్ ఆపడానికి ఎంట్రీ ఇచ్చిన శ్వేత.. పింకీని అడ్డుపెట్టుకొని భలే ఆడుతున్నారుగా!

Ammayi garu Today Episode రూప, రాజుల ఫస్ట్‌నైట్ ఆపడానికి శ్వేత సూర్యప్రతాప్ ఇంటికి వచ్చి గొడవ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి ముత్యాలు వాళ్లతో రాజు, రూపల ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేశారని కానీ తనకు బాలేని కారణంగా వాళ్లు ఆ కార్యాన్ని ఆపుకుంటున్నారని అందుకే మందారానికి ఫోన్ చేసి తనకు బాగుందని చెప్పి కార్యం ఆపనివ్వొద్దని చెప్పానని విరూపాక్షి చెప్తుంది. ఇక ముత్యాలు విరూపాక్షితో నన్ను గుడికి తీసుకెళ్లి రాజు కూడా వచ్చేలా చేసింది మీరే కదా అమ్మగారు అంటుంది.. అందుకు విరూపాక్షి కడుపు కోత తెలిసిన దాన్ని నీ బాధ అర్థం చేసుకోనా అని అడుగుతుంది. ముత్యాలు విరూపాక్షికి చేతులెత్తి దండం పెడుతుంది. మరోవైపు దీపక్, విజయాంబిక ఇద్దరూ ఫస్ట్‌నైట్ కోసం చాలా హడావుడి చేస్తారు. అది చూసిన సూర్య, చంద్రలు పింకీ జీవన్‌తో సంతోషంగా ఉండలేదని మాట్లాడుకుంటారు.

 దీపక్‌: బెడ్ మీద పూలు జల్లుతూ.. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగుంటే ఈ బెడ్ మీద రూపతో నేను ఫస్ట్‌ నైట్ జరుపుకునేవాడిని కానీ ఇప్పుడు రాజు, రూపల కోసం నేను బెడ్ సర్దుతున్నా అంతా నా ఖర్మ.. ఈ ఫస్ట్ నైట్ ఆగిపోతే బాగున్న మమ్మీ.
విజయాంబిక: అలా అనకు దీపక్ మనం ఏం అనుకున్నా అంతా రివర్స్ జరుగుతున్నాయి.
మందారం: సుమతో ఏం కాదులే అమ్మ
రూప: పిన్ని పింకీ గురించి ఏం ఆలోచించకు ఆ జీవన్ నుంచి పింకీని ఎలా కాపాడుకోవాలో నాకు రాజుకి తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు
సుమ: ఎలా ధైర్యంగా ఉండాలి రూప పింకీ మన ముందే ఉన్న కనీసం కన్నెత్తి చూడటం లేదు ఎలా ధైర్యంగా ఉండాలి.
రాజు: చిన్నమ్మ గారు రెండు రోజులు ఓపిక పట్టండి అసలేం జరిగిందో తెలుసుకొని అప్పుడు ఏదో ఒకటి చేద్దాం.
విజయాంబిక: తమ్ముడు అంతా రెడీ చేశాం.
శ్వేత: అన్నయ్యా అన్నయ్యా 
దీపక్: కరెక్ట్ టైంకి వచ్చింది మమ్మీ
శ్వేత: నమస్తే పెద్ద మామయ్య నమస్తే చిన్న మామయ్య అందరూ బాగున్నారా ఏంటి అన్నయ్యా ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్ ఎప్పుడూ చెల్లి చెల్లి అని ఈ చెల్లి చుట్టూ తిరిగే వాడివి ఇప్పుడు పెళ్లాం కొంగు పట్టుకొని తిరుగుతున్నావ్. వదినా బాగున్నావా. అన్నయ్యా నీ సెలక్షన్ సూపర్.
జీవన్: ఇంతకీ ఈ సడెన్‌ సర్‌ఫ్రైజ్ ఏంటి చెల్లి.
శ్వేత: అది అంతా పెద్ద కథ అన్నయ్య ఇక్కడ అందరూ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు నువ్వు రా అన్నయ్యా. రాజు రూపలకు ఇంత వరకు ఫస్ట్ నైట్ అవ్వలేదు అంటే నేను షాక్ అయ్యాను వాళ్లు నాటకాలు ఆడి నాతో జరగాల్సిన పెళ్లిని ఆపేశారు. ఇప్పుడు నేను కూడా వాళ్ల ఫస్ట్‌నైట్ ఆపేస్తా ఏదో ఒకటి చేసి.
జీవన్: నీ ఇష్టం శ్వేత ఈ అన్నయ్య ఎప్పుడూ నీకే అండగా ఉంటాడు. మీ వదిన కూడా నీకే సపోర్ట్ చేస్తాదిలే

రాజు, రూపలు రెడీ అయి కిందకి వస్తారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మందారం పాలు తీసుకొని వస్తుంది. రూప పాలు తీసుకొని గదిలోకి వెళ్తుంది. రాజుకి పాలు అందిస్తుంది. రాజు సగం తాగి సగం రూపకి ఇస్తుంది. ఇక మరోవైపు శ్వేత ఎలా అయినా ఆపాలని ప్లాన్ చేస్తుంది.. రూప రాజులు మాట్లాడుకుంటారు. ఇంతలో శ్వేత హాల్‌లోకి వెళ్లి అన్నయ్యా అన్నయ్యా అని పెద్దగా పిలుస్తుంది. అందరూ వచ్చి ఏమైందని అడిగితే మా అన్నయ్య ఎక్కడా అంటుంది. 

శ్వేత: అన్నయ్య నువ్వు ఒక్క నిమిషం ఈ ఇంట్లో ఉండటానికి వీళ్లేదు. గౌరవం లేని చోట నువ్వు ఉండటానికి వీల్లేదు.. నేను వచ్చి ఇంత సేపు అయినా మంచి నీరు కూడా ఇవ్వలేదు అంటే అర్థమవుతుంది నీకు ఇంట్లో ఎంత విలువ ఉందో అయినా మన ఇళ్లు ఉంటే నువ్వు ఇక్కడ ఉండటం ఏంటి. మీ పరువు పోతుందని వీళ్లని మీ ఇంట్లో ఉంచుకున్నారు అంతే కదా.
సూర్యప్రతాప్: శ్వేత వింటున్నా కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. మీ లాంటి వాళ్లు గుమ్మం తొక్కితే సహించం అలాంటిది మా పింకీ ముఖం చూసి ఊరుకున్నాం నిన్ను కూడా పింకీ కోసమే రానిచ్చాం. అంతేకానీ మా ఇంట్లో అడుగు పెట్టే అంత గౌరవస్తులు కాదు మీరు.
శ్వేత: రాజు రోడ్డున పడితే రూప రోడ్డున పడుతుందని ఇంట్లో పెట్టుకున్నారు కానీ మా అన్నయ్యకి అంత అవసరం లేదు ఇక్కడ ఇళ్లరికం ఉండటానికి.
సూర్యప్రతాప్: అయితే మీ అన్నని తీసుకొని బయటకి పో. పింకీ నాకు బరువు కాదు మా పరువు. మా పరువు ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. 
శ్వేత: అన్నయ్యా ఇంకా రాబుద్ది కావడంలేదా.
జీవన్: వస్తాను శ్వేత మీ వదిన పింకీనీ కూడా తీసుకొస్తా. 
చంద్ర: అమ్మా పింకీ నిన్ను వదిలి మేం ఉండలేం నువ్వు మమల్ని వదిలేసి ఉండలేవు వెళ్లకమ్మా.
జీవన్: పింకీ ఇందులో ఎలాంటి బలవంతం లేదు నేను కావాలి అనుకుంటే నాతో రా మీ ఇంట్లో వాళ్లు కావాలి అంటే ఇక్కడే ఉండిపో.

పింకీని ముందు శ్వేత, జీవన్ బెదిరిస్తారు. తాము చెప్పినట్లు చేయకపోతే మీ ఇంటి వాళ్ల పరువు తీస్తానని ఫస్ట్‌ నైట్ ఆపమని చెప్తారు. దాంతో పింకీ జీవన్‌తో వెళ్తానని అంటుంది. రూప పింకీతో నీకు వీడు అంత ఇంపార్టెంట్ అయ్యాడా అని అడిగితే నా భర్తని అలా అగౌరపరచకు అక్కా అంటుంది. ఇక రూప, రాజులు పింకీని గదిలోకి తీసుకెళ్లి నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి పగ పట్టి చంపేస్తుందని మహాలక్ష్మీని వణికించేసిన సీత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget