Rashmi Gautam New Movie : రష్మీ గౌతమ్ సినిమా రెడీ - వచ్చే నెలలో మాస్ అరాచకం!
బుల్లితెరపై వారం వారం సందడి చేసే రష్మీ గౌతమ్, త్వరలో వెండితెరపై సందడి చేయనున్నారు. ఆమె కథానాయికగా నటించిన సినిమా ఒకటి వచ్చే నెల తొలి వారంలో థియేటర్లలోకి రానుంది.
తెలుగు ప్రేక్షకులకు యాంకర్, యాక్ట్రెస్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి స్పెషల్ ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. 'ఎక్స్ట్రా జబర్దస్త్', ఇప్పుడు 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాలతో వారంలో మూడు రోజులు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. బుల్లితెరతో పాటు అప్పుడప్పుడూ ఆవిడ వెండితెరపై కూడా సందడి చేస్తుంటారు. రష్మీ గౌతమ్ కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆవిడ కథానాయికగా నటించిన ఓ సినిమా విడుదలకు రెడీ అయ్యింది.
నందుకు జంటగా...
నందు ఆనంద్ కృష్ణ (Nandu Anand Krishna ) కథానాయకుడిగా నటించిన సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' (Bomma Blockbuster Telugu Movie). ఇందులో ఆయనకు జోడీగా రష్మీ గౌతమ్ నటించారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మడ్డి, మనోహార్ రెడ్డి ఈడా నిర్మించారు. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది.
View this post on Instagram
మాస్ అరాచకం!
వచ్చే నెల (నవంబర్) 4వ తేదీన థియేటర్లలో 'బొమ్మ బ్లాక్ బస్టర్' (Bomma Blockbuster Release Date) సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. సినిమా విడుదల తేదీ పోస్టర్ షేర్ చేసిన నందు ''మాస్ అరాచకం'' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Also Read : 'కాంతారా' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాకు రాజ్ విరాఠ్ దర్శకత్వం వహించారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా అని ఆయన పేర్కొన్నారు. ఇంకా రాజ్ విరాఠ్ మాట్లాడుతూ ''బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్‌కి తగ్గట్లుగా సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని పక్కగా ఎంటర్‌టైన్ చేస్తుందని మా చిత్ర బృందం అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నా కథపై నమ్మకంతో, నా మీద భరోసాతో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన విజయీభవ సంస్థ వారికి, చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి మడ్డి, మనోహర్ రెడ్డి ఈడా గారికి స్పెషల్ థాంక్స్'' అని తెలిపారు. నందు ఆనంద్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ్, కూర్పు : బి సుభాస్కర్.
'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా మీద నందు ఆనంద్ కృష్ణ చాలా ఆశలు పెట్టుకున్నారు. 'పెళ్లి చూపులు'లో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. అంతకు ముందు '100 పర్సెంట్ లవ్', 'పాఠశాల', 'ఆటో నగర్ సూర్య' సినిమాల్లోనూ, ఆ తర్వాత 'సమ్మోహనం' తదితర సినిమాల్లోనూ ఆయన పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే... ఇప్పుడు సోలో హీరోగా నిలబడటం కోసం నందు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'సవారీ' సినిమాలో పాటలు హిట్ కావడంతో ఆ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ప్రేక్షకులు థియేటర్లకు అయితే వచ్చారు గానీ... నందు ఆశించిన విజయం లభించలేదు. అతడు కోరుకున్న విజయాన్ని 'బొమ్మ బ్లాక్ బస్టర్' ఇవ్వాలని ఆశిద్దాం