Bhamakalapam 2 : 'భామాకలాపం - 2'కి పైరసీ దెబ్బ - రిలీజైన గంటలోనే ఆన్ లైన్‌లో లీక్
Bhamakalapam 2 : 'భామాకలాపం - 2' సినిమా ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. రిలీజైన గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది.
Bhamakalapam 2 Full Movie Leaked Online For Free Download: సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. గతంలో రిలీజైన కొద్ది గంటల్లోనే థియేటర్ ప్రింట్ బయటికి వచ్చేది. ఎన్నో వెబ్ సైట్లలో సినిమా ప్రత్యక్షం అయ్యేది. ఇప్పుడిక ఓటీటీలో రిలీజయ్యే సినిమాలకి కూడా అదే జరుగుతోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే వివిధ వెబ్ సైట్లలో HD ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు నష్టం జరుగుతోంది. ఇక ఇప్పుడు ప్రియమణి నటించిన ‘భామాకలాపం - 2’ సినిమాకి పైరసీ దెబ్బ తగిలింది. సినిమా మొత్తం ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో వివిధ లింకులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సినిమా మొత్తాన్ని డౌన్ లోడ్ చేసి దాంట్లో పెట్టేస్తున్నారు.
రిలీజైన గంటల్లోనే..
'ఆహా' ఓటీటీలో రిలీజైన 'భామాకలాపం' సినిమాకి ఎంతో ఆదరణ లభించింది. ఇక దానికి సీక్వెల్‌గా 'భామాకలాపం - 2' సినిమా తీశారు మేకర్స్. దాన్ని కూడా 'ఆహా' ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 16న రిలీజ్ అయ్యింది. కాగా.. ఈ సినిమా రిలీజైన గంటల్లోనే లీక్ అయ్యింది. HD ప్రింట్ మొత్తం వివిధ వెబ్ సైట్లలో ప్రత్యక్షం అయ్యింది. సినిమా మొత్తం ఫ్రీగా చూసే విధంగా.. కొన్ని లింక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'భామాకలాపం' సినిమాలో ప్రియమణి లీడ్ క్యారెక్టర్ పోషించారు. అనుపమగా ప్రియమణి నటిస్తే.. ఆమె దగ్గర పనిమనిషి శిల్పగా ఫిదా ఫేమ్ శరణ్య నటించారు. ఇద్దరు కలిసి చేసిన కామెడీ అందరనీ అలరించింది. ఇక 'భామకలాపం' సినిమా విషయానికొస్తే.. పక్క వాళ్ళ విషయాల పట్ల ఆసక్తిని చూపే అనుపమ అనే మధ్యతరగతి గృహిణి ఓ మర్డర్ కేసులో ఎలా చిక్కుకుంది? ఆ నేరం నుంచి బయట పడేందుకు ఆమె చేసే ప్రయత్నాల నేపథ్యంలో 'భామాకలాపం' మూవీ తెరకెక్కింది.
ఇక ఇప్పుడు 'భామాకలాపం - 2' సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పోస్టర్లు, టీజర్లు కూడా ఆసక్తి రేపాయి. 'భామాకలాపం - 2' లో కూడా ప్రియమణి, శరణ్య కనిపించారు. కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు విలన్. అలాగే తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా ఐదు సంవత్సరాలుగా ఆంథోని లోబోతో ఉంటూ వస్తుంది. ఈ డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు వస్తుంది? య్యూట్యూబ్ లో ఫేమస్ అయిన అనుపమ, శరణ్య విలన్ పై రివేంజ్ తీర్చుకుంటారు. వాళ్లు ఎందుకు అలా చేయాల్సి వస్తుంది. ఏం జరిగిందనేది సినిమాలో చూడాల్సిందే.
ఈ సినిమాలో ప్రియమణి, శరణ్యతో పాటు శరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సందీప్ వేద్, అనిశ్ గుర్వారా, రఘు ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాని అభిమన్యు తడిమెటి డైరెక్షన్ వహించారు. సుధీర్ ఎడార ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చేశారు.
Also Read: గుడ్ న్యూస్, ఓటీటీలోకి 'హనుమాన్' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?