అన్వేషించండి

Nayanthara: దయచేసి నన్ను 'లేడీ సూపర్ స్టార్' అని పిలవకండి - నయనతార రిక్వెస్ట్, ఎందుకో తెలుసా?

Nayanthara: నయనతార పేరుకి ముందు ఫ్యాన్స్ ఓ బిరుదు ఇచ్చారు. ఇప్పుడా బిరుదుతో కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నానని చెబుతూ, తనని ఏమని పిలవాలో సూచించింది నయన్. ఈ మేరకు ఆమె ఓ లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Nayanthara Letter: నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తలలో ఉండే పేరు. మరి కావాలని అలా జరుగుతుందో, లేదంటే నార్మల్‌గానే జరుగుతుందో తెలియదు కానీ.. నయనతార పేరు మాత్రం సోషల్ మీడియాలో నిత్యం సంచరిస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా ధనుష్‌తో గొడవ, కోర్టు కేసులు అంటూ నయనతార పేరు ఎలా వినబడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ప్రేమలు, పెళ్లి, పిల్లలు, సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. ఇలా ఏదో ఒకటి నయనతార పేరును హైలెట్ చేస్తూనే ఉండేవి. ఇప్పుడామె మరోసారి వార్తలలోకి వచ్చేసింది. ఈసారి ఏంటి కారణం అనుకుంటున్నారా? ఆమెకు ఉన్న ట్యాగే. విజయశాంతి తర్వాత అందరూ లేడీ సూపర్ స్టార్ అని పిలిచిన తార ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నయనతార మాత్రమే. ఆమె స్ట్రగుల్స్, సక్సెస్‌లు అలా ఉన్నాయి మరి. ఇప్పుడా ట్యాగే వద్దంటుంది నయన్. ఆ ట్యాగ్‌తో కంఫర్ట్‌గా ఉండలేను, దయచేసి నన్ను అలా పిలవకండి అంటూ.. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖతో విజ్ఞప్తి చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఈ లేఖలో ఏముందంటే...

నయనతార ఎల్లప్పుడూ నయనతార మాత్రమే!
‘‘నా ప్రియమైన అభిమానులకు, గౌరవనీయులైన మీడియా సభ్యులకు మరియు సినీ కుటుంబానికి నమస్కారం. నటిగా నా ప్రయాణంలో నా ఆనందానికి మరియు విజయానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా జీవితం ఒక బహిరంగ పుస్తకం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీ నిస్వార్థ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం సంతోషం ఉంది. నాకు విజయం వచ్చినప్పుడు భుజం తడుతూ, కష్టం వచ్చినప్పుడు మద్దతు తెలుపుతూ.. ఇలా ఎప్పుడూ నా కోసం మీరు ఉన్నారు. 

Also Read: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం

మీలో చాలామంది నన్ను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుస్తున్నారు. నాపై ఉన్న ప్రేమ, అభిమానాలతో అలా పిలుస్తున్నందుకు కృతజ్ఞురాలిని. అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నా, నన్ను ‘నయనతార’ అని మాత్రమే పిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే, ఆ పేరు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఎవరో నాకు తెలియజేస్తుంది. కేవలం ఒక నటిగా ఇది చెప్పడం లేదు.. ఒక వ్యక్తిగా చెబుతున్నాను.

బిరుదులు, ప్రశంసలనేవి వెలకట్టలేనివి. కానీ అవి కొన్నిసార్లు మన పని నుండి, మన కళ నుండి, మనం పంచుకునే బంధం నుండి మనల్ని కంఫర్ట్‌గా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి. మన భవిష్యత్‌ను మనం ఊహించలేకపోవచ్చు. కానీ మనకున్న అన్ని పరిమితులను దాటి అందరితో ప్రేమను పంచుకోగలమని నేను నమ్ముతాను. ఎప్పటిలానే మీ సపోర్ట్ నాకు ఉంటుందని, అలాగే మిమ్మల్ని అలరించడానికి నేనెప్పుడూ కష్టపడుతూనే ఉంటానని సంతోషంగా చెప్పగలను. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దానిని మనమంతా ఎప్పుడూ సెలబ్రేట్‌ చేసుకుందాం. ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలతో- మీ నయనతార’’ అంటూ ‘నయనతార ఎల్లప్పుడూ నయనతార మాత్రమే’ అని ఈ లేఖలో చెప్పుకొచ్చింది నయన్.

Also Readనిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
తెలుగులో జస్ట్ 60 లక్షలే... మరి తమిళంలో? ఆరు రోజుల్లో 'జన నాయకుడు' కలెక్షన్స్ ఎంత?
Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఓవర్సీస్‌లో 50 లక్షలే... మరి తెలుగు రాష్ట్రాల్లో? ఐదు రోజుల్లో 'చెన్నై లవ్ స్టోరీ' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Kalatheylaa Song Lyrics: కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget