'డియర్' మూవీ రివ్యూ, ఎన్టీఆర్ 'వార్ 2' లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
Prabahs Raja Saab Movie Will Give a Visual Feast: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాజాసాబ్'. నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంతా షాక్ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఈ హీరో మీడియం బడ్జెట్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఏంటని అనుకున్నారు. మరోవైపు ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అయ్యిందా? అని అనుమానాలు కూడా వచ్చాయి. ఈ చిత్రంపై ఎన్ని రూమర్స్ వచ్చినా ఏ రోజు మారుతి నోరువిప్పలేదు. అధికారిక ప్రకటన ఎలాంటి అప్‌డేట్, ప్రచారం లేకుండానే సైలెంట్‌గా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్' (Dear Movie). కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులలో తనకు అంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. గురక నేపథ్యంలో 'డియర్' తీయడం... ఐశ్వర్యా రాజేష్ కథానాయక కావడం... సిమిలర్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ 'గుడ్ నైట్' విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తి ఎదురు చూశారు. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Jr NTR Lands in Mumbai: మ్యాన్ ఆప్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ మోడ్‌లోకి దిగపోతున్నాడు. 'వార్ 2' సెట్‌లో ఎంట్రీకి అంతా సిద్ధమైంది. ఇక తలపడటమే మిగిలిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. దీనితో పాటు 'వార్ 2' మూవీకి కూడా సైన్ చేశాడు. ఈ చిత్రంతోనే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనిపై ప్రకటన వచ్చిన చాలా రోజులు అవుతున్నా ఇంకా అతడు సెట్‌లో అడుగుపెట్టలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ టైం వచ్చింది. వార్ 2 షూటింగ్ కోసం అతడు నిన్న ముంబై పయనమయ్యాడు. అక్కడ ముంబై ల్యాండ్ అయిన తారక్ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తారక్ ముంబైలో దిగగానికి ఎయిర్‌పోర్టు, అక్కడ తారక్ దిగిన నివాసం ముందు సందడి వాతావరం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Ramayanam Producers Yash, Namit Malhotra Share Exciting Details: బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా 'రామయణం' తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటించబోతున్నారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు, ఈ మూవీ రావడం మాత్రం కన్‌ఫాం. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు నితీష్ తివారి. అయితే ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకుండానే ఈ సినిమాకు సంబంధించి రోజుకో పుకారు షికారు చేస్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Actor Sayaji Shinde Hospitalised: ప్రముఖ నటుడు షాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిని వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేస నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కానున్నారు. కాగా గతంలోనూ ఆయన ఛాతీనొప్పికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. షాయాజి సిండే కొద్ది రోజుల క్రితమే ఆస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)