By: ABP Desam | Updated at : 04 Jul 2023 02:39 PM (IST)
షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆయనకు గాయాలు అయిన మాట వాస్తవమే. అయితే... పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
అమెరికాలో షూటింగ్ చేస్తుండగా...
షారుఖ్ ఖాన్ ఓ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం లాస్ ఏంజిల్స్, అమెరికా వెళ్లారు. అక్కడ చిత్రీకరణ చేస్తుండగా... సెట్స్‌లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన ముక్కుకు చిన్న గాయాలు అయ్యాయని తెలిసింది. హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.
షారుఖ్ (Shah Rukh Khan Injured)కు అయిన గాయమేమీ పెద్దది కాదని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. ముక్కు గాయం కావడంతో రక్తం కారిందని, యూనిట్ అంతా కంగారుపడి వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లారని టాక్. ముక్కుకు బ్యాండేజ్ వేసిన తర్వాత లాస్ ఏంజిల్స్ నుంచి ముంబైలో తన ఇంటి (మన్నత్)కి షారుఖ్ చేరుకున్నారు. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
షారుఖ్ అభిమానులకు ట్రిపుల్ ధమాకా!
'పఠాన్' విడుదలకు ముందు వెండితెరపై షారుఖ్ ఖాన్ సినిమా వచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు! మధ్యలో 'రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్', 'లాల్ సింగ్ చద్దా', 'బ్రహ్మాస్త్ర : పార్ట్ 1' సినిమాలు చేసినా సరే... వాటిలో ఆయన హీరో కాదు. అతిథి పాత్రలు చేశారు. 'జీరో' తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 'పఠాన్'తో బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టారు.
'పఠాన్' సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. అంతే కాదు... బాక్సాఫీస్ బరిలో షారుఖ్ ఖాన్ ఇంకా బాద్షా అని ప్రూవ్ చేసింది. ఆ సినిమా విజయం కింగ్ ఖాన్ షారుఖ్‌కు మాత్రమే కాదు, హిందీ చలన చిత్ర పరిశ్రమకు కూడా ఊపిరి ఇచ్చింది. ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలతో ఈ ఏడాది షారుఖ్ ఖాన్ థియేటర్లలోకి రానున్నారు. అంటే... అభిమానులకుయ్ ట్రిపుల్ ధమాకా అన్నమాట.
సెప్టెంబర్ 7న 'జవాన్' విడుదల!
'పఠాన్'తో హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్... సెప్టెంబర్ 7న 'జవాన్' సినిమాతో మన ముందుకు రానున్నారు. ఇందులో సౌత్ క్వీన్ నయనతార కథానాయిక. ఆమెకు ఇది తొలి హిందీ సినిమా. నయన్ కాకుండా ఈ సినిమాలో ప్రియమణి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 'జవాన్'తో తమిళ దర్శకుడు అట్లీ కూడా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. విజయ్ హీరోగా తమిళంలో వంద కోట్లు వసూలు చేసిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది.
'జవాన్' విడుదలైన రెండు నెలలకు మళ్ళీ షారుఖ్ ఖాన్ థియేటర్లలో సందడి చేయనున్నారు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో ఆయన సందడి చేయనున్నారు. అందులో స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 'పఠాన్'లో సల్మాన్ ఖాన్ కనిపించినది కాసేపే అయినప్పటికీ... ఆ సన్నివేశాలను ప్రేక్షకులను చాలా ఎంటర్టైన్ చేశాయి. దాంతో షారుఖ్ ఖాన్ సీన్స్ కూడా 'టైగర్ 3'లో స్పెషల్ అవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : తెలుగు తెరకు 'ఫ్యామిలీ మ్యాన్' కుమార్తె - అగ్ర నిర్మాత అండతో...
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
/body>