అన్వేషించండి

Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్

నితేష్ తివారీ 'రామాయణం'లో సీత పాత్రను పోషిస్తున్న సాయి పల్లవి, ఈ సినిమా కోసమే శాఖాహారిగా మారినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడింది.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) 'తండేల్', 'రామాయణం' వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అందరి కళ్ళూ ఇప్పుడు ఆమె చేస్తున్న 'రామాయణం' సినిమాపైనే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సీత పాత్రను పోషిస్తున్నందుకుగాను సాయి పల్లవి మాంసాహారాన్ని వదిలేసి శాఖాహారిగా మారందని వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా సాయి పల్లవి ఆ పుకార్లపై సీరియస్ అవుతూ చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? 

రామాయణంలో సీత పాత్రను సాయి పల్లవి పోషిస్తుంది. అయితే సీతాదేవిపై ఉన్న భక్తితో ఆమె శాఖాహారిగా మారింది అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి స్పందిస్తూ సీరియస్ అయింది. ఎందుకంటే నిజానికి సాయి పల్లవి ప్యూర్ వెజిటేరియన్. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన జీవితంలోని అతి ముఖ్యమైన మూడు వాల్యూస్ గురించి మాట్లాడింది. అందులో ఒకటి చిన్నప్పటి నుంచి తను వెజిటేరియన్ అని, తన కళ్ళ ముందు ఏదైనా ఒక ప్రాణి జీవం విడుస్తుంటే తను చూడలేనని, కాబట్టి జీవితాంతం వెజిటేరియన్ గానే ఉంటానని స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఇక డైలీ మెడిటేషన్ చేస్తానని, ఎవరిని హార్ట్ చేయనని... ముఖ్యమైన మూడు వాల్యూస్ గురించి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి మాంసాహారి అని, ఆమె 'రామాయణం' సినిమా కోసం శాకాహారిగా మారిందనే వార్తలపై తీవ్రంగా మండి పడింది. 

పుకార్లపై సాయి పల్లవి ఫైర్... 

తాజాగా సాయి పల్లవి శాకాహారిగా మారింది అంటూ వచ్చిన వార్తలను ట్యాగ్ చేస్తూ ఆమె సుదీర్ఘమైన నోట్ ను పంచుకుంది. సోషల్ మీడియాలో ఆ పుకార్లపై సాయి పల్లవి స్పందిస్తూ "చాలా సార్లు... దాదాపు ప్రతిసారి... నేను నిరాధారమైన పుకార్లు, తప్పుడు ప్రచారం చూసినప్పుడల్లా మౌనంగానే ఉంటాను (ఇది ఆ దేవుడికే తెలుసు). కానీ ఆ తప్పుడు ప్రచారాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యే టైం వచ్చేసింది. ముఖ్యంగా నా సినిమాల రిలీజ్ లు / ప్రకటనలు/ నా కెరీర్ లో సంతోషించదగిన క్షణాల సమయంలో. నెక్స్ట్ టైం నుంచి నేను ఏదైనా ప్రముఖ పేజీని / మీడియా / వ్యక్తిని... వార్తలు / గాసిప్ పేరుతో ఒక చెత్త కథనాన్ని ప్రచారం చేయడం చూస్తే... లీగల్ గా నా నుంచి సమాధానాన్ని వింటారు" అంటూ పలు మీడియా సంస్థలను ట్యాగ్ చేసి ఇచ్చి పడేసింది సాయి పల్లవి. ఇక సదరు వెబ్సైట్ లో సాయి పల్లవి శాకాహారిగా మారిందని, అందుకే ఆమె ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేకంగా తన ఫుడ్ కోసం ఒక షెఫ్ టీంని వెంట తీసుకెళ్తుందని, ఆ టీం కేవలం శాకాహారం మాత్రమే వండుతోందని రాసుకొచ్చారు.

Also Read'జాతి రత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్... నాగ్ అశ్విన్ క్లాప్‌తో మొదలైన మూవీ, షూటింగ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Bollywood Rewind 2024: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
Embed widget